SCR Weekly Special Trains : వేసవి సెలవులు ఉండటంతో రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రయాగ్‌రాజ్ - ఎస్.ఎస్.ఎస్. హుబ్బళ్లి స్టేషన్ల మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ వారంతపు ప్రత్యేక రైళ్లు కాచిగూడ మీదుగా నడుపుతున్నట్లు పేర్కొంది.
వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - వివరాలు :
- (ప్రయాగ్‌రాజ్ - హుబ్బళ్లి, రైలు నంబర్ 04113): ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. జూన్ 6, 2026 నుంచి జులై 11, 2026 వరకు మొత్తం 6 సర్వీసులను రైల్వే శాఖ కేటాయించింది.
- (ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్లి- ప్రయాగ్‌రాజ్, రైలు నంబర్ 04114 ) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. జూన్ 9, 2026 నుండి జులై 14, 2026 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ రూట్‌లో కూడా 6 సర్వీసులు నడుస్తాయి.
- ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో త్రీ-టైర్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. మధ్యతరగతి, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీట్ల లభ్యతను పెంచారు.
స్టాపింగ్ స్టేషన్లు:

రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ముఖ్య నగరాల మీదుగా సాగుతాయి. ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, భింద్, సోని, గ్వాలియర్, శివ్‌పురి, గుణా, బినా, భోపాల్, నాగ్‌పూర్, బల్లార్షా స్టేషన్లలో ఇవి ఆగుతాయి.
అలాగే మన తెలుగు రాష్ట్రాల పరిధిలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా ప్రయాణించి.. కర్ణాటకలోని యలహంక, తుమకూరు, అరసికెరె, దావణగెరె, హావేరి స్టేషన్లలో ఆగుతూ గమ్యస్థానానికి చేరుకుంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వేసవి ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.