...
...
Next Story

ప్రయాణికులకు శుభవార్త... సికింద్రాబాద్ - కాగజ్‌నగర్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్, హాల్ట్ లిస్ట్ వివరాలివే

SCR Puja Festival Special Trains : పూజా పండగల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య దక్షిణ మధ్య రైల్వే 22 రోజువారీ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5 వరకు ఇవి నడుస్తాయి.

Published on: Oct 25, 2026, 12:54:54 IST
Advertisement

SCR Puja Festival Special Trains : పండగల సీజన్‌లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో 22 రోజువారీ పూజా పండగ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల సర్వీసులు - టైమింగ్స్ :

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక విడత రైళ్లు 2026 అక్టోబర్ 26 నుండి 2026 నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. రెండు వైపులా కలిపి మొత్తం 22 సర్వీసులను రైల్వే శాఖ నిర్వహించనుంది.

  • రైలు సంఖ్య 07711 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్) : ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. అక్టోబర్ 26 నుండి నవంబర్ 5 వరకు మొత్తం 11 సర్వీసులు నడుస్తాయి.
  • రైలు సంఖ్య 07712 ( సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజూ సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి బయలుదేరి, అదే రోజు రాత్రి 23:15 (11:15) గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ మార్గంలో కూడా అక్టోబర్ 26 నుండి నవంబర్ 5 వరకు మొత్తం 11 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

రైలు ఆగే ప్రధాన స్టేషన్లు (హాల్ట్‌లు) ….

ఈ పండగ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ ఛైర్ కార్ , రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. పండగ సమయంలో ప్రయాణించే వారు ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks