ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్– చర్లపల్లి, పోదనూర్ – బరౌని మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్‌లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. బీహార్, తమిళనాడు ప్రజలు కూడా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఎన్ని సర్వీసులు, ఏ తేదీల్లో ఉన్నాయో చూడండి.
నరసాపూర్ - చర్లపల్లి ట్రైన్

ట్రైన్ నెంబర్ 07062 నరసాపురం – చర్లపల్లి ఆదివారం రాత్రి 10 గంటలకు బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 8.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 04.10.2026 నుండి 29.11.2026 వరకు 9 సర్వీసులు నడుస్తాయి.
ట్రైన్ నెంబర్ 07063 చర్లపల్లి – నర్సాపూర్ సోమవారం రాత్రి 7.50 బయల్దేరి మంగళవారం ఉదయం 7.00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 05.10.2026 నుండి 30.11.2026 వరకు 9 సర్వీసులు ఉంటాయి.
నరసాపూర్ - చర్లపల్లి- నరసాపూర్ నడుమ మెుత్తం 18 సర్వీసులు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
పోదనూర్ – బరౌని ట్రైన్
రైలు నెంబర్ 06021 పోదనూర్ – బరౌని ఆదివారం ఉదయం 06.15లకు బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 01.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. 04.10.2026 నుండి 01.11.2026 వరకు 5 సర్వీసులు నడుస్తాయి.
రైలు నెంబర్ 06022 బరౌని – పోదనూర్ బుధవారం ఉదయం 10.30 బయల్దేరి శుక్రవారం సాయంత్రం 06.30కి చేరుకుంటుంది. 07.10.2026 నుండి 04.11.2026 వరకు 5 సర్వీసులు నడవనున్నాయి.
{{/usCountry}}రైలు నెంబర్ 06022 బరౌని – పోదనూర్ బుధవారం ఉదయం 10.30 బయల్దేరి శుక్రవారం సాయంత్రం 06.30కి చేరుకుంటుంది. 07.10.2026 నుండి 04.11.2026 వరకు 5 సర్వీసులు నడవనున్నాయి.
{{/usCountry}}పోదనూరు - బరౌని - పోదనూరు ప్రత్యేక రైళ్లు 10 సర్వీసులు నడుస్తాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ, పిపారియా, గదర్‌వారా, జబల్‌పూర్, కాట్ని, మైహర్ సత్నా, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛెయోకి, చునార్, పీటీ. డీడీ ఉపాధ్యాయ, బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, షాపూర్ పటోరీ స్టేషన్‌లు రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.