అక్టోబర్‌లో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్.. నర్సాపూర్– చర్లపల్లి మధ్య 18 సర్వీసులు
SCR Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఈ రైలు సర్వీసులు ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్– చర్లపల్లి, పోదనూర్ – బరౌని మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్‌లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. బీహార్, తమిళనాడు ప్రజలు కూడా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఎన్ని సర్వీసులు, ఏ తేదీల్లో ఉన్నాయో చూడండి.

నరసాపూర్ - చర్లపల్లి ట్రైన్
ట్రైన్ నెంబర్ 07062 నరసాపురం – చర్లపల్లి ఆదివారం రాత్రి 10 గంటలకు బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 8.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 04.10.2026 నుండి 29.11.2026 వరకు 9 సర్వీసులు నడుస్తాయి.
ట్రైన్ నెంబర్ 07063 చర్లపల్లి – నర్సాపూర్ సోమవారం రాత్రి 7.50 బయల్దేరి మంగళవారం ఉదయం 7.00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 05.10.2026 నుండి 30.11.2026 వరకు 9 సర్వీసులు ఉంటాయి.
నరసాపూర్ - చర్లపల్లి- నరసాపూర్ నడుమ మెుత్తం 18 సర్వీసులు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
పోదనూర్ – బరౌని ట్రైన్
రైలు నెంబర్ 06021 పోదనూర్ – బరౌని ఆదివారం ఉదయం 06.15లకు బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 01.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. 04.10.2026 నుండి 01.11.2026 వరకు 5 సర్వీసులు నడుస్తాయి.
రైలు నెంబర్ 06022 బరౌని – పోదనూర్ బుధవారం ఉదయం 10.30 బయల్దేరి శుక్రవారం సాయంత్రం 06.30కి చేరుకుంటుంది. 07.10.2026 నుండి 04.11.2026 వరకు 5 సర్వీసులు నడవనున్నాయి.
పోదనూరు - బరౌని - పోదనూరు ప్రత్యేక రైళ్లు 10 సర్వీసులు నడుస్తాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ, పిపారియా, గదర్‌వారా, జబల్‌పూర్, కాట్ని, మైహర్ సత్నా, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛెయోకి, చునార్, పీటీ. డీడీ ఉపాధ్యాయ, బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, షాపూర్ పటోరీ స్టేషన్‌లు రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


