Hyderabad Kollam Festival Special Trains : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణించే వారి సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, కొల్లాం మధ్య ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 2027లో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
8 ప్రత్యేక సర్వీసులు..
- 07193 నంబరు రైలు హైదరాబాద్ నుంచి కొల్లాం వైపు శనివారాల్లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 7.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. 2027 జనవరి 2 నుంచి జనవరి 23 వరకు మొత్తం 4 సర్వీసులు నడుస్తాయి.
- 07194 నంబరు రైలు కొల్లాం నుంచి హైదరాబాద్ వైపు సోమవారాల్లో ఉదయం 10.55 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. 2027 జనవరి 4 నుంచి జనవరి 25 వరకు మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆగుతాయంటే…?

హైదరాబాద్ నుంచి బయలుదేరే 07193 రైలు సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల వద్ద ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో 07194 కొల్లాం - హైదరాబాద్ రైలు తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చర్లపల్లి, సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సెరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కాయంకుళం స్టేషన్లలో ఆగుతాయి. శబరిమల భక్తులకు, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.