South Central Railway Special Trains 2026 : తెలుగు రాష్ట్రాల మీదుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రాబోయే ఆగస్టు నెలలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు కాన్పూర్ సెంట్రల్ నుంచి తమిళనాడులోని మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కీలకమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి ప్రధాన నగరాలు, పట్టణాల మీదుగా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాది, దక్షినాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే భక్తులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది.
రైళ్ల వివరాలు… వేళలు:
కాన్పూర్ సెంట్రల్ - మధురై స్పెషల్ (ట్రైన్ నంబర్ 01925) :
- ఈ ప్రత్యేక రైలు కాన్పూర్ సెంట్రల్‌లో బుధవారం ఉదయం 08:10 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది.
- ఆగస్టు నెలలో ఈ రైలు 05.08.2026, 12.08.2026, 19.08.2026 మరియు 26.08.2026 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
మధురై - కాన్పూర్ సెంట్రల్ స్పెషల్ (ట్రైన్ నంబర్ 01926) :
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధురైలో శనివారం తెల్లవారుజామున 02:30 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది.
- ఈ సర్వీసు ఆగస్టు నెలలో 08.08.2026, 15.08.2026, 22.08.2026 మరియు 29.08.2026 తేదీలలో నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
హాల్ట్ స్టేషన్లు…
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా పోఖ్రాయాన్, ఒరాయ్, వీరంగాన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, నామక్కల్, కరూర్ మరియు దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా పోఖ్రాయాన్, ఒరాయ్, వీరంగాన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, నామక్కల్, కరూర్ మరియు దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
{{/usCountry}}ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2-టైర్ (2AC), ఏసీ 3-టైర్ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.