తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) నూతన ఛైర్మన్‌గా ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన TS HOUSEFED డైరెక్టర్ల ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు.. సోమవారం సమావేశమై ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు TS HOUSEFEDను మరింత అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
'ప్రస్తుతం ఫెడరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చి ఫెడరేషన్‌ను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేస్తాం. ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని హౌసింగ్ సొసైటీలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వాటి అభివృద్ధికి కృషి చేస్తాం. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. సొసైటీలకు అవసరమైన రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చి, హౌసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రతి సొసైటీ సభ్యుడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఫెడరేషన్ లక్ష్యం.' అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఫెడరేషన్ నుంచి సొసైటీలు పొందే రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా సొసైటీలు కూడా ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. సొసైటీలు బలోపేతం అయితేనే ఫెడరేషన్ మరింత బలపడుతుందని తెలిపారు.
సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తాం : గోపరాజు
నూతనంగా ఎన్నికైన వైస్ ఛైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్న డైరెక్టర్లకు, ఎన్నికకు సహకరించిన అన్ని హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డైరెక్టర్ల సమన్వయంతో పనిచేస్తూ TS HOUSEFEDను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
{{/usCountry}}నూతనంగా ఎన్నికైన వైస్ ఛైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకున్న డైరెక్టర్లకు, ఎన్నికకు సహకరించిన అన్ని హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డైరెక్టర్ల సమన్వయంతో పనిచేస్తూ TS HOUSEFEDను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
{{/usCountry}}హౌసింగ్ సొసైటీల సభ్యులకు రుణ సదుపాయాలను మరింత సులభతరం చేయడంతో పాటు సొసైటీల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఫెడరేషన్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని గోపరాజు అన్నారు. ప్రతి సభ్యుడికి సొంత ఇంటి కలను సాకారం చేయడంలో ఫెడరేషన్ తన వంతు పాత్ర పోషించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఫెడరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం పొందుతూ, సొసైటీలను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గోపరాజు పేర్కొన్నారు. నూతన పాలకవర్గం, డైరెక్టర్లతో కలిసి సమష్టిగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్రంలోని వివిధ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల అధ్యక్షులు, ప్రతినిధులు, సభ్యులకు నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్, కిషన్‌రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TS HOUSEFED ఎండీ జి.లక్ష్మీభాయి నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బ్రహ్మాండబేరి గోపరాజులను అభినందించారు.