...
...
Next Story

రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - ఈసారి కూడా వాడీవేడిగానే...!

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కృష్ణా జలాల అంశంపై సభలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి జరగబోయే సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది.

Published on: Dec 28, 2025 12:40 PM IST
Advertisement

నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగే దిశగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ సభలను నిర్వహించే యోచనలో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఇటీవల ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించగా… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలో చర్చ చేద్దామని ప్రతి సవాల్ కూడా చేసింది. అయితే ఈసారి జరగబోయే సమావేశాల్లో నీటి హక్కుల అంశంపై ప్రధానంగా చర్చ జరగొచ్చు.

గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ స్పందిస్తూ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్వ తోలు తీస్తామని హెచ్చరించారు.

ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అధికార పక్షం నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. సీఎం రేవంత్ సహా మంత్రులు కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణకు ఎక్కువ ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe