...
...
Next Story

బాంబులు పెట్టి పేల్చేశారు.. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై రచ్చ!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. జనవరి 2న తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Published on: Dec 29, 2025, 14:46:18 IST
Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మెుదలయ్యాయి. సీఎం రేవంత్ రెజ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి బాగున్నారా అని అడిగారు. కాసేపటికే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సభ కాసేపు నడిచింది. అసెంబ్లీని జనవరి 2వ తేదీ వరకు స్పీకర్ వాయిదా వేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే హుజురాబాద్ నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యాం బాంబులు పెట్టి పేల్చేశారని కౌశిక్ రెడ్డి అన్నారు.

దీంతో అసెంబ్లీలో ఆందోళన మెుదలైంది. పౌడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏంటని ఎదురుదాడికి దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించాలని స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు.

'నా నియోజకవర్గంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చివేశారు. మేడిగడ్డ మాదిరిగానే చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారు. హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయింది. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలి.' అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

ట్రెజరీ బెంచీల వైపు ఆ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చొన్నారు. అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ముగ్గురూ అటువైపుగా కూర్చున్నట్టుగా కనిపించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పిటిషన్‌పై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేశారు. వారు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్టుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని, అనర్హత వేటు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks