TG Govt Free Coaching : ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? మీకోసమే ఉచిత కోచింగ్ ఆఫర్, నెలకు స్టైపెండ్ కూడా..!
Telangana BC Study Circle Coaching : తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్సెస్సీ, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం 125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Telangana BC Study Circle Coaching : ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
రాష్ట్రంలో రాబోయే వివిధ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను సర్వసన్నద్ధం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రూప్-I, గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV తో పాటు బ్యాంకింగ్ సర్వీసెస్ ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), వివిధ పోలీస్ నియామక పరీక్షలకు సంబంధించి ఉమ్మడి ఫౌండేషన్ శిక్షణను ఉచితంగా అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
నెలకు రూ.1,000 స్టైపెండ్
ఈ ఫౌండేషన్ కోచింగ్ కార్యక్రమాన్ని మొత్తం 125 రోజుల పాటు (సుమారు ఐదు నెలలు) నిర్వహించనున్నారు. అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఐదు నెలల కాలానికి స్టైపెండ్ అందిస్తోంది. ఈ మొత్తాన్ని అభ్యర్థుల పుస్తక నిధి, రవాణా భత్యం (బస్ పాస్) ఖర్చుల కోసం మంజూరు చేస్తారు. అయితే….. ఈ ఆర్థిక సాయం పొందడానికి అభ్యర్థికి ప్రతి నెలా కనీసం 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ హాజరు శాతాన్ని నమోదు చేయడం నిబంధనగా విధించారు.
ఎవరు అర్హులు…?
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తప్పనిసరిగా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభ్యర్థి కుటుంబ వార్షిక రాబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించేవారికైతే రూ.2.00 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు మరియు సంబంధిత స్టడీ సర్కిల్‌లో ఉన్న అందుబాటు సీట్ల ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం….
కోర్సులో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ www.tgbcstudycircle.cgg.gov.in లో ఆన్‌లైన్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మరిన్ని సందేహాలు లేదా సాంకేతిక సాయం కోసం అభ్యర్థులు సైదాబాద్‌లోని ప్రధాన కార్యాలయాన్ని నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.
- ఆఫీస్ చిరునామా : టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ – 500059.
- ఫోన్ నంబర్ : 040-24071178
- మొబైల్ నంబర్: 7780359322
ముఖ్య తేదీల సమాచారం:
- నోటిఫికేషన్ విడుదల జూలై 24, 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం జూలై 25, 2026
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 14, 2026
- ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన ఆగస్టు 18, 2026
- ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఆగస్టు 20 నుండి ఆగస్టు 24, 2026 వరకు
- ఉచిత కోచింగ్ తరగతుల ప్రారంభం ఆగస్టు 25, 2026.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

