నేడు మేడారంలో కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు…!

ఇవాళ మేడారం వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా స్కీమ్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.

Published on: Jan 18, 2026, 07:07:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం వేదికగా తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఇందుకోసం మొత్తం కేబినెట్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు.

తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్

మేడారంలోని హారిత హోటల్ లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ… కేబినెట్ భేటీ విశేషంగా మారింది.

ముఖ్యమంత్రి పర్యటనతో పాటు కేబినెట్ సమావేశం నేపథ్యంలో మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. మునుపెన్నడూ లేనంత భద్రతను ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించడం ఇదే తొలిసారి.

కీలక అంశాలపై చర్చ…!

మేడారం వేదికగా జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై వేగంగా కసరత్తు కొనసాగుతోంది. కీలకమైన రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

ప్రస్తుత రబీ సీజన్‌లో రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంపై కూడా కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది. అంతేకాకుందా గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులపై చర్చించే అకాశం ఉంది. పొట్లపూర్‌ ఎత్తి పోతల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో…. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇక మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. అయితే కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More