మేడారంలో కేబినెట్ భేటీ - ముహుర్తం ఫిక్స్, చరిత్రలో తొలిసారి…!

మేడారం వేదికగా తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఈనెల 18వ తేదీన సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన జారీ అయింది. హైదరాబాద్ కాకుండా ఓ మారుమూల గ్రామంలో కేబినేట్ భేటీ కావటం ఇదే తొలిసారి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Published on: Jan 16, 2026, 16:52:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అతిపెద్ద కుంభమేళ జాతరగా పేరొందిన మేడారం వేదికగా మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న భేటీ కాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వలు జారీ అయ్యాయి.

తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్

ఈనెల 18వ తేదీన మేడారంలోని హారిత హోటల్ లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ… కేబినెట్ భేటీ విశేషంగా మారింది.

ఇక సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అది కూడా కోట్లాది మంది భక్తులు అత్యంత విశ్వసించే మేడారం గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ కాకుండా ఓ మారుమూల గ్రామంలో కేబినెట్ భేటీ కావటం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

ఇక మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. అయితే కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది. అంతేకాకుండా రైతు భోరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ఈ నెల 28న ప్రారంభం కానున్న సమ్మక్క - సారక్క మహా జాతర ప్రారంభమై… 31వ తేదీన ముగుస్తుంది. ఇక ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వెళ్తారు. 19న ఉదయం పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు.

ఇదే తొలిసారి - మంత్రి పొంగులేటి

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. "గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది" అని స్పష్టం చేశారు.

సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More