...
...
Next Story

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ - స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం..!

సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి… నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Published on: Nov 16, 2025, 07:25:22 IST
Advertisement

ఈనెల 17వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వటంతో 42 శాతం రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. అప్పట్నుంచి ఎన్నికల నిర్వహణ పెండింగ్ లోనే ఉండిపోయింది.

కేబినెట్ లో చర్చ - ఆపై నిర్ణయం…!

రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరంగానే మారింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువస్తోంది. తమ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ఎన్నికలపై చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks