...
...
Next Story

TG SSC Exams 2027 : పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే..?

Telangana SSC Exams 2027 : వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అప్డేట్ ఇచ్చింది. ఎగ్జామ్ ఫీజు చెల్లించే గడువును డిసెంబరు 2 వరకు పొడిగించింది.

Updated on: Nov 27, 2026, 10:44:30 IST
Advertisement

Telangana SSC Exams 2027 : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు నవంబరు 26తో ముగిసింది. ఇప్పుడు ఆ గడువును డిసెంబరు 2 వరకు పెంచుతూ గురువారం ప్రకటన జారీ చేసింది.

పరీక్ష రుసుముల వివరాలు :

  • ఆరు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ. 125.
  • మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష ఫీజు రూ. 110.
  • ఆలస్య రుసుమును కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రకటించే నోటిఫికేషన్ల ప్రకారం వసూలు చేస్తారు.
  • స్కూల్ స్టడీ లేకుండా ప్రైవేట్‌గా హాజరయ్యే అభ్యర్థులకు హాజరు మినహాయింపు రుసుము రూ. 650.
  • రీకౌంటింగ్ రుసుము ఒక్కో సబ్జెక్టుకు రూ. 150.
  • వయోపరిమితి సడలింపు రుసుము రూ. 300.
  • ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు హాజరు మినహాయింపు రుసుముతో పాటు అదనంగా ప్రత్యేక రుసుము రూ. 650 ఉంటుంది. దీనిపై నోటిఫికేషన్ నిబంధనలను పరిశీలించాలి.
  • ఏదైనా ఎస్ఎస్‌సీ పరీక్షకు సంబంధించిన మార్కుల మెమో, వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం రుసుము రూ. 80.
  • డూప్లికేట్ పాస్ సర్టిఫికెట్ జారీకి రుసుము రూ. 250.
  • ఎస్ఎస్‌సీ పరీక్ష ఫీజుకు అదనంగా ఎస్ఎస్‌సీ ఒకేషనల్ రుసుము రూ. 60 ఉంటుంది.

టెన్త్ పరీక్షలు
టెన్త్ పరీక్షలు

పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి పొడిగించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. హెచ్‌ఎంలు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందే ఫీజులు చెల్లించాలి. అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లోని స్కూల్ లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో మాత్రమే ఫీజు కట్టాలి. IFMIS పోర్టల్ చలాన్లు లేదా మాన్యువల్ బ్యాంక్ చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

ఇక తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం… ఈసారి టెన్త్ పరీక్షలు మార్చి 17 లేదా 18న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్‌సీ పరీక్షలు ఒక నెల రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 10వ తేదీతో పరీక్షలు ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు. మెుత్తం 24 రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కు ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ఖరారవుతుంది.

Also Read Telangana SSC Exams 2027 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి!
 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks