CM Revanth Reddy US Visit Denied : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో ఈ పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది.
అనుమతి నిరాకరణ…

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లేలా ముందస్తు షెడ్యూల్ ఖరారైంది. లండన్ పర్యటన ముగించుకుని ఆగస్టు 30 నాటికి హైదరాబాద్ చేరుకోవాలని ఆయన భావించారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో… అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సిన సీఎం… తన పర్యటనను రద్దు చేసుకుని ఆగస్టు 23నే లండన్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్, న్యూయార్క్‌లలో పర్యటించి హార్వర్డ్, ఎంఐటీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం పర్యటన రద్దయినప్పటికీ…. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఈ పర్యటనను కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా విద్యాసంస్థలు, భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
"విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత భవిష్యత్తు విషయాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం," అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న ముఖ్యమంత్రి తన ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. వీటితో పాటు బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కూడా చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు.
{{/usCountry}}ప్రస్తుతం లండన్‌లో ఉన్న ముఖ్యమంత్రి తన ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. వీటితో పాటు బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కూడా చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు.
{{/usCountry}}అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.