SRPCC Conference in Hyderabad : దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు.

హైదరాబాద్‌లోని ICCC లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ (SRPCC) సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను వివరించి నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో రాష్ట్రాల మధ్య సమన్వయ అవసరాన్ని నొక్కి చెప్పారు.
సమన్వయం ఎంతో అవసరం - సీఎం
“ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అత్యంత కీలకమైన ఇలాంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి” అని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, నేరాల రేటును అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
“సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ (ICCC) వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు.
"రోజురోజుకు నేరాల స్వభావం మారుతున్న ఈ కాలంలో ఎస్‌ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకంగా మారుతాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందింది" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
{{/usCountry}}"రోజురోజుకు నేరాల స్వభావం మారుతున్న ఈ కాలంలో ఎస్‌ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకంగా మారుతాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందింది" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
{{/usCountry}}ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి హైదరాబాద్ మహానగరంలో పోలీస్ వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించామని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించామని… ఈ విభజన వల్ల పోలీసు కమిషనర్లు తమ భౌగోళిక పరిధిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత మెరుగైన ఫలితాలు అందించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. దీంతో పాటు నేరాల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక దృష్టిని సారించడానికి వీలుగా హైడ్రా (HYDRAA), ఈగల్ , టీ-సేఫ్ (T-Safe) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని వివరించారు.
“సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి గారు నిర్వహించిన ప్రగతి (PRAGATI) సమీక్ష సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు రాష్ట్రాన్ని పూర్తిగా నక్సల్స్ రహితంగా మార్చడంలో విశేష కృషి చేసిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అభినందించారు” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
“మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం సాధించిన పనితీరుకు కేంద్ర ప్రభుత్వం80 శాతానికి పైగా మార్కులిచ్చింది. సైబర్ నేరాల బాధితులకు కోల్పోయిన సొమ్మును తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. తెలంగాణ ప్రారంభించిన హైడ్రా చెరువులు, జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వవైభవం తీసుకురావడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటోంది. అదే సమయంలో ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల భద్రతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోంది” అని తెలిపారు.
ఎస్‌ఆర్‌పీసీసీ(SRPCC) సదస్సును హైదరాబాద్ లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని చెప్పారు.
ఈ ఉన్నత స్థాయి సదస్సులో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎం.ఏ. సలీమ్, తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ సహా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.