మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ.. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు

Digital Media Policy : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ తీసుకురానున్నట్టుగా వెల్లడించింది.

Published on: Mar 18, 2026, 20:02:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ తీసుకురానున్నట్టుగా వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. 'జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. స్థల కేటాయింపులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు కార్యాచరణ చేపడుతున్నాం. మీడియా మిత్రులకు పూర్తి రక్షణ కల్పించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

డిజిటల్ మీడియా పాలసీపై ప్రభుత్వం ప్రకటన
డిజిటల్ మీడియా పాలసీపై ప్రభుత్వం ప్రకటన

'డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీ తుదిరూపునకు వచ్చింది. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రభుత్వ ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. మీడియా మిత్రులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదే. ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మీడియా మిత్రులను ఏ రకంగానూ విభజించడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు పెద్దల సూచనల మేరకు కమిటీలు వేశామన్నారు. న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్లనే ఆలస్యమవుతోందన్నారు. ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. వందకు వంద శాతం పాజిటివ్ దృక్పథంతో నిర్ణయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

2014 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 20వేల కోట్లు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కానీ ఖర్చు పెట్టింది మాత్రం సుమారు 6000 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. వారి హయాంలో పూర్తయిన వాటిని ఆక్యుపై చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులందరికీ త్వరలోనే ఇండ్లను అందజేస్తుందన్నారు.

రాష్ట్రంలో వివిధ స్థాయిలో ఉన్న 2బీహెచ్‌కేలు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ 99 రోజుల ప్రణాళికలో కేటాయిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొ్న్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రభుత్వానికి ఎలాంటి పక్షపాతం లేదన్నారు. పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకైనా ఇండ్లనిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

వివిధ స్థాయిలో నిలిచిన 2BHK పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులను ముందుగానే గుర్తించి ఇండ్లను కేటాయిస్తామన్నారు. కాంట్రాక్టర్ ముందుకొస్తే వారితో మిగిలిన పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. లబ్ధిదారుడే నిర్మాణం పూర్తి చేసుకుంటే నిధులిస్తామన్నారు.

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్స్‌లను ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 99శాతం పూర్తి చేశామన్నారు. ఇంకా ఎక్కడైనా అరకొర పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. 'పట్టణ పేదలకు దూర ప్రాంతాల్లో 2బీహెచ్‌కే, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం వల్ల అక్కడ నివాసం ఉండడానికి ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలింది. వారు పనిచేసే ప్రాంతానికి ఒకటి, రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లను నిర్మించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందుకు అనుగుణంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.' అని మంత్రి పొంగులేటి చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More