ప్రస్తుత రోజుల్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సరైన గైడెన్స్ లేకపోతే… చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈ తరహా అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో…. ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యుగంలో ప్రతిది క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే పట్టణ ప్రాంత విద్యార్థులతో పోల్చితే…. గ్రామీణ విద్యార్థులు సమాచారం తెలుసుకోవటం కొంత ఇబ్బందికరమే..! అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా తెలంగాణ విద్యాశాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎడ్యుకేషన్, కెరీర్ అవకాశాలపై పాఠశాల విద్యార్థుల సందేహాలను తీర్చే దిశగా విద్యాశాఖ అడుగు ముందుకేసింది. యూనిసెఫ్, నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో కలిసి సమగ్ర శిక్షా విభాగం 18004252428 అనే టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు పలు అంశాల్లో మార్గనిర్దేశం చేసి… కెరీర్ గైడెన్స్ ఇవ్వనుంది.
ఈ తరహా సేవలు ముఖ్యంగా టెన్త్ విద్యార్థులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. టెన్త్, ఇంటర్ ఇంటర్ తర్వాత అందుబాటులో ఉండే కోర్సులు, ఉపాధి అవకాశాలను ఈ ప్రత్యేక సేవల ద్వారా వివరిస్తారు.
నైపుణ్యాభివృద్ధి, స్కాలర్‌షిప్‌లు తదితర వాటి గురించి ఫోన్‌లోనే నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
టైమింగ్స్ ఇలా….
ఆసక్తిగల విద్యార్థులు 18004252428 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఈ నెంబర్ పని చేస్తుంది. సెలవులు మినహాయిస్తే స్కూల్ పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం దీన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈ తరహా సేవలను తీసుకురావటంతో గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. టెన్త్ తర్వాత ఎలాంటి కోర్సులు చదివితే ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దానిపై ఓ అవగాహనకు కూడా రాగలుగుతారు. ఇంటర్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై కూడా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నిర్ణయాలతో సంబంధం లేకుండా విద్యార్థి ఆసక్తి మేరకు నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ సేవలు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది.
{{/usCountry}}ఈ తరహా సేవలను తీసుకురావటంతో గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. టెన్త్ తర్వాత ఎలాంటి కోర్సులు చదివితే ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దానిపై ఓ అవగాహనకు కూడా రాగలుగుతారు. ఇంటర్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై కూడా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నిర్ణయాలతో సంబంధం లేకుండా విద్యార్థి ఆసక్తి మేరకు నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ సేవలు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది.
{{/usCountry}}