...
...
Next Story

డిసెంబర్ 11 నుంచి తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరగనున్నాయి.

Published on: Oct 5, 2026, 14:12:39 IST
Advertisement

డిసెంబర్ 11 నుండి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్(KIYG) ఎనిమిదో ఎడిషన్‌ను నిర్వహించడానికి తెలంగాణ రెడీ అవుతోంది. ఇందులో 27 క్రీడా విభాగాలలో జరిగే పోటీలలో 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ క్రీడలు హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్.. ఇలా ఆరు నగరాల్లో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 1,500 మందికి పైగా సహాయక సిబ్బంది, 1,000 మంది సాంకేతిక అధికారులు, 200 మందికి పైగా ప్రముఖులు పాల్గొంటారని భావిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో 23 క్రీడా విభాగాలకు సంబంధించిన పోటీలు జరుగుతాయి. మిగిలిన పోటీలు వివిధ జిల్లా కేంద్రాలలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి.

ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రోయింగ్(Rowing) క్రీడను ఎంపిక చేసుకోగా.. సెయిలింగ్ ప్రదర్శన క్రీడగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న వాటర్ స్పోర్ట్స్ కేంద్రం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ పోటీలు జరుగుతాయి.

గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, జెఎన్‌టీయూహెచ్, సికింద్రాబాద్, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా పోటీలు ఉంటాయి. హైదరాబాద్, క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జిల్లాల్లోని మొత్తం 10 వేదికల వద్ద 12 రకాల ఆధునీకరణ, అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. క్రీడాకారుల కోసం దుస్తులు మార్చుకునే గదులు, ప్రేక్షకుల సౌకర్యాలు, మరుగుదొడ్ల బ్లాకుల మెరుగుదలతోపాటు స్విమ్మింగ్ పూల్స్, సైక్లింగ్ ట్రాక్‌లు, షూటింగ్ రేంజ్‌లు, ఇతర క్రీడా మైదాన సదుపాయాల ఆధునీకరణ పనులు ఇందులో ఉన్నాయి.

తెలంగాణను ఒక ప్రధాన క్రీడా, అంతర్జాతీయ ఈవెంట్ల గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. యువతరాన్ని భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రాష్ట్రం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని, డిజిటల్-ఫస్ట్ ఫిట్‌నెస్ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తోంది. డిసెంబర్‌లో జరిగే క్రీడలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks