...
...
Next Story

Telangana Government: తుపాకీ వదిలి టూరిస్ట్ గైడ్లుగా..! మాజీ మావోయిస్టులకు 'గిరిదర్శక్' ఉద్యోగాలు, నియామక పత్రాల అందజేత

Jobs For Former Maoists in Telangana : అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన 20 మంది మాజీ మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ‘గిరిదర్శక్’లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి వీరికి నియామక పత్రాలు అందజేశారు.

Published on: Apr 29, 2026, 08:14:42 IST
Advertisement

Jobs For Former Maoists in Telangana : హింసా మార్గాన్ని వీడి… సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్న ఆకాంక్షతో జనజీవన స్రవంతిలో కలిసిన గిరిజన యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న 20 మంది మాజీ మావోయిస్టులను ‘గిరిదర్శకులు’గా (టూరిస్ట్ గైడ్లు) నియమించింది. మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు భూమి పూజ నిర్వహించిన సందర్భంగా… వీరికి యువకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.

టూరిజం శాఖ ఆధ్వర్యంలో శిక్షణ…

నియామక పత్రాలు అందజేత
నియామక పత్రాలు అందజేత

లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ (టూరిస్ట్ గైడ్) లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నియమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శిక్షణనిచ్చారు.

  • తొలి విడతగా ఎంపిక చేసిన 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సహాయంగా ఈ గిరిదర్శక్‌లు పనిచేస్తారు.
  • పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతో పాటు పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శక్‌లు సహాయంగా నిలుస్తారు.
  • గిరిజన యువతను సమాజంలో భాగస్వామ్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. వారిలో మనోధైర్యం కల్పించాలన్న సంకల్పంతో సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయడం, గతంలో తీవ్రవాద ప్రభావం ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారిని ఆ ప్రాంతంలో నియమించారు.
  • ఈ గిరిదర్శకు‌లు ప్రత్యేక యూనిఫామ్‌ల్లో విధులను నిర్వర్తిస్తారు. ఒకప్పుడు మావోయిస్టులకు దారి చూపిన వాళ్లు ఇకనుంచి పర్యాటకులకు దారి చూపిస్తారు.
  • గిరి దర్శకులుగా ఎంపిక చేసిన వారికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
  • సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని…. శిక్షణ కాలంలో వారికి స్కాలర్‌షిప్ అందించాలని చెప్పారు.

జనజీవన స్రవంతిలోకి రండి - సీఎం రేవంత్ పిలుపు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks