Telangana Assistant Professor Recruitment 2026 : రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఏడు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల (సహాయ ఆచార్యులు) నియామక ప్రక్రియకు చివరకు మార్గం సుగమమైంది. యూనివర్సిటీల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు (జీవో 141) జారీ చేసింది. మొత్తం 429 పోస్టులను ఈ విడతలో భర్తీ చేయనున్నారు.
వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు….

ఉన్నత విద్యామండలి సమర్పించిన వివరాల ఆధారంగా ఆర్థిక శాఖ వర్సిటీల వారీగా ఖాళీలను ఖరారు చేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (ఓయూ) 252 పోస్టులు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు 16 చొప్పున పోస్టులు దక్కాయి. అయితే డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి కేవలం రెండు ఖాళీల భర్తీకే అనుమతి లభించాయి.
- ఉస్మానియా యూనివర్శిటీ - 252
- కాకతీయ యూనివర్శిటీ- 49
- శాతవాహన - 49
- పాలమూరు - 45
- అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ - 16
- తెలుగు యూనివర్సిటీ - 16
- తెలంగాణ వర్సిటీ - 2
ఈ నియామక ప్రక్రియ వేగవంతం కావడం వెనుక ఇటీవలి పరిణామాలు కీలక పాత్ర పోషించాయి. 2025 ఏప్రిల్ 4న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ మార్గదర్శకాలపై ప్రభుత్వం జీవో ఇచ్చినా….. కొన్ని నెలల పాటు ఎలాంటి కదలిక లేదు. అయితే, గత నెల చివరి వారంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితులను విన్నవించారు. వైస్ ఛాన్సలర్ల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
పది రోజుల క్రితం పాత జీవో 21కి సవరణలు చేస్తూ జీవో 31ను ప్రభుత్వం తీసుకొచ్చింది. తాజాగా విభాగాల వారీగా ఖాళీల సంఖ్యను స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ జీవో 141ను జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్లు, దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలితో పాటు ఆయా విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విడతలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లనే భర్తీ చేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలను ఇందులో చేర్చలేదు.
- ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి చర్యలకు వర్సిటీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.
- ఏ పోస్టు ఏ సామాజిక వర్గానికి (రిజర్వేషన్లు) కేటాయించాలో నిర్ణయిస్తూ రోస్టర్ పాయింట్లను త్వరలోనే రూపొందిస్తారు.
- ఈ రోస్టర్ పాయింట్లకు సంబంధిత సంక్షేమ శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
- అనంతరం వర్సిటీల పాలకమండళ్ల (బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్) ఆమోదం పొంది, అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేస్తారు.
- ఈ ప్రక్రియ మొత్తానికి సుమారు నెల రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిష్పత్తి 1:3:6గా ఉండాలి. కానీ, ఏళ్ల తరబడి కొత్త నియామకాలు చేపట్టకపోవడం, పాతవారు రిటైర్ అవుతుండటంతో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఈ నిష్పత్తి పూర్తిగా తలకిందులైంది. అరకొర భర్తీలతో ఉన్నత విద్య నాణ్యత ఏమాత్రం మెరుగుపడుతుందనే అంశంపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరిగతిన అన్ని ఖాళీలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని కోరుతున్నారు.