Telangana QR Code Ration Card : ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో (QR Code) కూడిన కార్డులను పంపిణీ చేయనుంది.ఈ కొత్త కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి కాగా… పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఈ కార్డులను అన్ని జిల్లాలకు చేరవేసింది.

ఈ సరికొత్త స్మార్ట్ కార్డుల పంపిణీపై అధికారికంగా తేదీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ తేదీని ఖరారు చేసిన వెంటనే…. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వీటిని అందజేయనున్నారు. ఆ దిశగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.
స్మార్ట్ గా… సరికొత్తగా…
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. వీటిని మన చేతిలో ఉండే క్రెడిట్, డెబిట్ కార్డుల సైజులో ఎంతో రూపొందించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై లబ్ధిదారుడి (యజమాని) ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించారు.
- ఈ కొత్త కార్డుల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ క్యూఆర్ కోడ్. రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనేది తెలిసిపోతుంది.
- కార్డులో ఉన్నవారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
- కార్డుదారుడు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి… కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ (వేలిముద్ర) వేసి సులభంగా రేషన్ తీసుకోవచ్చు.
సాంకేతికతను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘టి రేషన్’ (T Ration) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు ఈ యాప్‌ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, ఓటీపీ (OTP) ద్వారా తమ రేషన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. భద్రత కోసం ఒక ఎం-పిన్ (M-PIN) కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తమ రేషన్ కోటా వివరాలను మొబైల్లోనే ఎప్పటికప్పుడు చూసుకునే వీలుంటుంది.
{{/usCountry}}సాంకేతికతను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘టి రేషన్’ (T Ration) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు ఈ యాప్‌ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, ఓటీపీ (OTP) ద్వారా తమ రేషన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. భద్రత కోసం ఒక ఎం-పిన్ (M-PIN) కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తమ రేషన్ కోటా వివరాలను మొబైల్లోనే ఎప్పటికప్పుడు చూసుకునే వీలుంటుంది.
{{/usCountry}}ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే పూర్తి ఖర్చును పౌరసరఫరాల శాఖే భరిస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొత్త కార్డుల కోసం ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,39,96,239 గా ఉంది. ఈ భారీ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పంపిణీ పండుగ షురూ కానుంది.