TG Anganwadi Recruitment 2026 : అంగన్‌వాడీల్లో 15,982 ఉద్యోగాలు - జిల్లాల వారీగా నోటిఫికేషన్లు! ఖాళీల వివరాలు

TG Anganwadi Recruitment 2026 : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15,982 అంగన్‌వాడీ టీచర్, సహాయకురాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్ విద్యార్హతతో పాటు ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు.

Published on: Jun 23, 2026, 10:34:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Anganwadi Recruitment 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఉన్న ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు జిల్లాల వారీగా విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

అంగన్‌వాడీల్లో 15,982 ఉద్యోగాలు - జిల్లాల వారీగా నోటిఫికేషన్లు!
అంగన్‌వాడీల్లో 15,982 ఉద్యోగాలు - జిల్లాల వారీగా నోటిఫికేషన్లు!

మొత్తం 15,982 ఖాళీల్లో 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. మిగిలిన 12,882 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాలు (హెల్పర్స్) విభాగానికి చెందినవి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి మొత్తం 177 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేశారు.

త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ నోటిఫికేషన్లు….

రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.ఖాళీల వివరాలను ఆయా నోటిఫికేషన్లలో పేర్కొంటారు. షెడ్యూల్ కు అనుగుణంగా… అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంగన్వాడీల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ విద్యార్హతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా….. ఈసారి ఎంపిక ప్రక్రియలో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన జీవోలు కూడా జారీ అయ్యాయి.

రాష్ట్రంలోని రెండు మల్టీజోన్ల పరిధిలో ఖాళీలను అధికారులు ఈ కింది విధంగా వర్గీకరించారు…

  • మల్టీజోన్-1 : ఈ జోన్ పరిధిలోని 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,853 టీచర్ పోస్టులు, 7,737 సహాయకుల పోస్టులు ఉన్నాయి.
  • మల్టీజోన్-2 : ఈ జోన్ పరిధిలోని 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 1,247 టీచర్ పోస్టులు, 5,145 సహాయకుల పోస్టులు ఉన్నాయి.

అంగన్‌వాడీ ఉద్యోగాల నియామాకాల్లో స్థానికత అత్యంత కీలకంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత గ్రామం లేదా వార్డులో స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడెలలోని పోస్టులకు స్థానికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులవుతారు. తాజా నిబంధనల ప్రకారం…. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను పూర్తి చేస్తారు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి : ఆసిఫాబాద్ జిల్లాలో 182 టీచర్లు, 452 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మంచిర్యాలలో 110 టీచర్లు, 398 సహాయకులు, ఆదిలాబాద్ జిల్లాలో 176 టీచర్లు, 628 సహాయకులు, నిర్మల్ జిల్లాలో 80 టీచర్లు, 435 సహాయకుల ఖాళీలు ఉన్నాయి.
  • ఉమ్మడి కరీంనగర్, వరంగల్ పరిధి : పెద్దపల్లిలో 56 టీచర్లు, 252 సహాయకులు, జయశంకర్ భూపాలపల్లిలో 50 టీచర్లు, 133 సహాయకులు, ములుగులో 95 టీచర్లు, 319 సహాయకులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జగిత్యాలలో 70 టీచర్లు, 352 సహాయకులు, కరీంనగర్‌లో 56 టీచర్లు, 230 సహాయకులు, రాజన్న సిరిసిల్లలో 57 టీచర్లు, 181 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్‌లో 116 టీచర్లు, 478 సహాయకులు, వరంగల్‌లో 63 టీచర్లు, 289 సహాయకులు, హనుమకొండలో 71 టీచర్లు, 240 సహాయకులు, జనగామలో 27 టీచర్లు, 187 సహాయకుల పోస్టులు భర్తీ కానున్నాయి.
  • ఉమ్మడి నిజామాబాద్, మెదక్, నల్గొండ : నిజామాబాద్ జిల్లాలో 80 అంగన్వాడీ టీచర్లు, 601 సహాయకులు, కామారెడ్డిలో 106 టీచర్లు, 445 సహాయకులు ఉన్నారు. సిద్దిపేటలో 84 టీచర్లు, 271 సహాయకులు, మెదక్‌లో 63 టీచర్లు, 345 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేటలో 84 టీచర్లు, 321 సహాయకులు, నల్గొండలో 148 టీచర్లు, 688 సహాయకులు, యాదాద్రి భువనగిరిలో 62 టీచర్లు, 270 సహాయకుల ఖాళీలు ఉన్నాయి.
  • హైదరాబాద్ పరిసరాలు, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 192 టీచర్లు, 1,033 సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో 136 టీచర్లు, 655 సహాయకులు ఖాళీగా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 64 టీచర్లు, 227 సహాయకులు, హైదరాబాద్ జిల్లాలో 183 టీచర్లు, 402 సహాయకులు, రంగారెడ్డిలో 137 టీచర్లు, 611 సహాయకులు, సంగారెడ్డిలో 80 టీచర్లు, 416 సహాయకులు, వికారాబాద్‌లో 94 టీచర్లు, 399 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 62 టీచర్లు, 364 సహాయకులు, నారాయణపేటలో 32 టీచర్లు, 196 సహాయకులు, జోగులాంబ గద్వాలలో 65 టీచర్లు, 308 సహాయకులు, వనపర్తిలో 47 టీచర్లు, 203 సహాయకులు, నాగర్‌కర్నూల్‌లో 162 టీచర్లు, 553 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More