Hyderabad MMTS Free Travel Proposal : ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే (SCR) కలిసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. అయితే…. ఈ అంశంపై సోషల్ మీడియాలో కొన్ని ఖాతాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని, పుకార్లను ప్రచారం చేస్తుండటంతో ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది.
ప్రతిపాదన వివరాలు:
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA) మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ కీలక ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించాయి. ఏప్రిల్ 7, 2026వ తేదీన అధికారికంగా ఈ ప్రతిపాదనను పంపడం జరిగింది.
ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే నిబంధనలు , షరతులతో కూడిన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవాలని కోరింది. ప్రస్తుత ఎంఎంటిఎస్ సేవలు, నిత్యం ప్రయాణించే వారి సంఖ్య మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే తెలిపింది. అంతేకాకుండా…. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి రైల్వే బోర్డు ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది.
గమనించాల్సిన కీలక అంశాలు:
ఎంఎంటిఎస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారం దక్షిణ మధ్య రైల్వే మరియు రైల్వే బోర్డు పరిధిలోనే ఉంటుంది. ఎన్ని రైళ్లు నడపాలి,,,? ఏ సమయాల్లో రైళ్లు అందుబాటులో ఉండాలి…? స్టేషన్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఏమిటి…? ఈ అంశాలన్నీ రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే జరుగుతాయి. కాబట్టి, ప్రభుత్వం పంపే తుది ప్రతిపాదనలో ఈ అంశాలన్నింటినీ చేర్చాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ పథకం కేవలం పరిశీలన దశలో మాత్రమే ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు ప్రజలు సంయమనం పాటించాలని…. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా రైల్వే శాఖ అధికారికంగా ప్రకటిస్తుందని స్పష్టం చేసింది.
{{/usCountry}}ప్రస్తుతానికి ఈ పథకం కేవలం పరిశీలన దశలో మాత్రమే ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు ప్రజలు సంయమనం పాటించాలని…. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా రైల్వే శాఖ అధికారికంగా ప్రకటిస్తుందని స్పష్టం చేసింది.
{{/usCountry}}