...
...
Next Story

Minimum Wages Hike : తెలంగాణ సర్కార్ శుభవార్త - కార్మికుల కనీస వేతనాల పెంపు, జూన్ 1 నుంచి అమలు! పూర్తి వివరాలు

Telangana Minimum Wages Hike 2026 : తెలంగాణలోని కోటి మందికి పైగా కార్మికులకు సర్కార్ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి కనీస వేతనాలు పెంచనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

Published on: May 21, 2026, 16:06:58 IST
Advertisement

Telangana Minimum Wages Hike 2026 : తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణ సర్కార్ శుభవార్త - కార్మికుల కనీస వేతనాల పెంపు,
తెలంగాణ సర్కార్ శుభవార్త - కార్మికుల కనీస వేతనాల పెంపు,

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాది శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 విభాగాలుగా విభజించినట్టు చెప్పారు.

ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్‌గా 2 జోన్లు ఉండేవని…. వాటిని ఇప్పుడు 3 జోన్లుగా విభజించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించామని చెప్పారు.

4 కేటగిరిలు - జూన్ 1 నుంచి అమలు

అన్‌స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ. 12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500 లకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పెంచిన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

కార్మిక సంఘాలు, నాయకులు, ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతర స్టేక్‌హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వేతన సవరణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారి ఈ నిర్ణయం జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

కార్మికుల శ్రేయస్సు కోసమే నిర్ణయం - సీఎం రేవంత్

“ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల పెరుగుదల, ఇంటి అద్దె వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు శుభవార్త” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనేక దేశాల్లో స్కిల్డ్ లేబర్ కొరత ఉందని, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్ల చేతుల్లో కార్మికులెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.

ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు. అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారికి ఏం కావాలో అందుకు అనుగుణంగా ఇక్కడి నుంచి కార్మికులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందని…. తొందర్లోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు.

గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వారి అండగా నిలవడమే కాకుండా ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe