తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.5 లక్షల 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' (Indiramma Family Insurance Scheme) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 19 నుంచే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకం దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు.

రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు, పూర్తిగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఒక సభ్యుడికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో, నామినీలుగా పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఈ బీమా సొమ్ము అందుతుంది. కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి నుండి 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జిల్లా కలెక్టర్లు, అధికారులకు కీలక ఆదేశాలు
నవంబర్ 19 నుండి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామ స్థాయిలోనే దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకంపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ నమోదు ప్రక్రియ జరిగేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పాత బీమా పథకాల విలీనం.. పరిమితి పెంపు
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న బీమా పథకాల్లో జీవిత బీమా రూ.2 లక్షల వరకు, ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల కింద ఉన్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూనే, కొత్తగా ప్రతిపాదించిన 'ఇందిరమ్మ బీమా' పథకం ద్వారా జీవిత బీమా పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది
{{/usCountry}}ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న బీమా పథకాల్లో జీవిత బీమా రూ.2 లక్షల వరకు, ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల కింద ఉన్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూనే, కొత్తగా ప్రతిపాదించిన 'ఇందిరమ్మ బీమా' పథకం ద్వారా జీవిత బీమా పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు.
ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది
{{/usCountry}}ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబంలోని సంపాదించే ఒక సభ్యుడికి రూ.5 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, నామినీలకు ఆ మొత్తం అందుతుంది. పాలసీకి సంబంధించిన పూర్తి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం కష్టాల్లో పడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకం ఉద్దేశాన్ని వివరించారు.
5 లక్షల బీమా కవరేజీకి ఎవరు అర్హులు?
ఆదాయ, కుల, మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేకుండా తెలంగాణలోని కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణలో చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు అర్హులు. కుటుంబంలో సంపాదించే ఒక సభ్యుడికి మాత్రమే ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. బీమా చేయించుకునే సభ్యుడి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే, ఎవరి పేరు మీద బీమా తీసుకోవాలో కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు.
కుటుంబాలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించుకోవచ్చు. అంతేకాకుండా బీమా సొమ్మును వారి మధ్య ఏ నిష్పత్తిలో పంచాలో కూడా ముందుగానే పేర్కొనవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
నవంబర్ 19 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారం పొందడానికి అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీలు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాలను సంప్రదించాలి.
దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలతో పాటు, బీమా చేయించుకోబోయే కుటుంబ సభ్యుడి వివరాలను స్పష్టంగా నింపాలి.
బీమా పొందిన వ్యక్తి మరణించిన పక్షంలో ఆ సొమ్మును పొందే నామినీ లేదా నామినీల వివరాలను రాయాలి.
ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంచుకుంటే, ఎవరికి ఎంత శాతం బీమా సొమ్ము చెందాలో వివరంగా రాయాలి.
దరఖాస్తును సమర్పించే ముందు బీమా వ్యక్తి, నామినీల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి.
దరఖాస్తులో నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, వారి సమ్మతి తీసుకున్న తర్వాతే బీమా వ్యక్తి సంతకం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి స్వయం సహాయక సంఘాలు, స్థానిక పరిపాలనా అధికారుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. దీనితో పాటు ప్రత్యేక మొబైల్ యాప్, ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఏవి?
ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి అధికారిక పత్రాల జాబితా ఇంకా వెలువడనప్పటికీ, దరఖాస్తుదారులు పలు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
చెల్లుబాటు అయ్యే తెలంగాణ రేషన్ కార్డు.
బీమా చేయించుకునే సభ్యుడి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలు.
బీమా పొందే కుటుంబ సభ్యుడి వ్యక్తిగత వివరాలు (వయస్సు, వృత్తి మొదలైనవి).
నామినీలుగా పేర్కొనే వారి పేర్లు, వారి గుర్తింపు వివరాలు.
దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్.