తెలంగాణలో 22-ఎ (22-A) నిషేధిత భూముల సమస్యలతో పాటు దశాబ్దాలుగా నానుతున్న భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జీవో 59 దరఖాస్తుదారులకు కూడా శుభవార్తను అందించింది.
నెల రోజుల్లో పరిష్కారం - మంత్రి పొంగులేటి

గత నెల 16వ తేదీన రాష్ట్ర శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జీవో 59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులను రాబోయే నెల రోజుల్లోగా పరిష్కరించాలని సర్కారు నిర్ణయించిందన్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో విడుదల చేసిన జీవో నంబర్లు 14, 22, 29, 41 లకు అనుగుణంగా ప్రభుత్వం మెమో నంబర్ 48030 ను విడుదల చేసింది.
శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జీవో 59 అమలులో కొన్ని అక్రమాలు జరిగాయని తమ దృష్టికి రావడం వల్లే గతంలో జీవో అమలును నిలిపివేశామని గుర్తుచేశారు. అలాంటి పొరపాట్లు, అక్రమాలు పునరావృతం కాకుండా యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్ధిదారుల అర్హత, క్రమబద్ధీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించి కన్వేయన్స్ డీడ్స్ (జారీ చేసిన కేసులను కూడా సమగ్రంగా పునఃపరిశీలించాలన్నారు.
{{/usCountry}}జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్ధిదారుల అర్హత, క్రమబద్ధీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించి కన్వేయన్స్ డీడ్స్ (జారీ చేసిన కేసులను కూడా సమగ్రంగా పునఃపరిశీలించాలన్నారు.
{{/usCountry}}"గత ప్రభుత్వ హయాంలో సంవత్సరాల తరబడి ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో వాటిని క్లియర్ చేయకపోవడంతో చిన్నచిన్న ఇళ్ల స్థలాలు, ఆస్తుల కోసం సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది," అని పొంగులేటి పేర్కొన్నారు. అయితే న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో మాత్రం సంబంధిత కోర్టులు ఇచ్చే తీర్పులు, ఆదేశాలకు లోబడి మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
22-ఎ సమస్యలపై వరుస నిర్ణయాలు…
శాసనసభలో సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు కమిటీ ఏర్పాటుతో కలిపి ఆరు కీలక ఉత్తర్వులను జారీ చేశామని మంత్రి వివరించారు. 22-ఎ తో ముడిపడి ఉన్న 10 నుంచి 12 ప్రధాన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామన్నారు.
ఇప్పటికే జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేశామన్నారు. ఒకవేళ భూమి 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ , డీటీసీపీ (DTCP) లేదా స్థానిక మున్సిపాలిటీల నుంచి అధికారిక అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు దశాబ్దాలుగా బకాయి ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారం, నాలా (NAALA) ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని… తాజాగా జీవో 59 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు.