హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఆస్తి రిజిస్ట్రేషన్ రుసుములు భారీగా పెరిగే అవకాశం ఉంది. క్యూఆర్ పరిధిలోని ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సమయంలో ఈ వార్త కూడా వైరల్ అవుతోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలను 15 శాతం నుండి 30 శాతం వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కొత్త ధరలు జూన్ నెల నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మూడు జిల్లాల్లో ప్రతి నెలా సుమారు 40,000 నుండి 50,000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ధరలు 15 శాతం పెరిగితే కొనుగోలుదారులపై నెలకు రూ.150 కోట్ల నుండి రూ.180 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే 30 శాతం పెరిగితే, ఈ భారం నెలకు ఏకంగా రూ.300 కోట్ల నుండి రూ.360 కోట్లకు చేరుకుంటుంది.
ఐటీ హబ్‌లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిసరాలు, వాణిజ్య సముదాయాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, మియాపూర్, రాయదుర్గం, మాదాపూర్, ఫిలింనగర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ధరలు భారీగా మారనున్నాయి. కొన్ని ప్రీమియం ప్రాంతాలలో ప్రభుత్వ భూమి విలువ గజానికి రూ.1 లక్ష దాటే అవకాశం ఉంది.
ప్రభుత్వ మార్కెట్ విలువ పెరిగినప్పుడు.. దానికి అనుగుణంగా మనం కట్టే స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఒక ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వ విలువ గజానికి రూ.7,500 ఉందనుకుంటే.. ప్రభుత్వం దానిని 30 శాతం పెంచితే, కొత్త ధర గజానికి రూ.9,750 అవుతుంది.
దీనివల్ల 100 గజాల స్థలాన్ని కొనే వ్యక్తి ఇదివరకు రూ.56,200 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే సవరణ తర్వాత రూ.73,125 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
{{/usCountry}}దీనివల్ల 100 గజాల స్థలాన్ని కొనే వ్యక్తి ఇదివరకు రూ.56,200 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే సవరణ తర్వాత రూ.73,125 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
{{/usCountry}}గచ్చిబౌలి, రాయదుర్గం, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రతిపాదిత ప్రభుత్వ ధరలు గజానికి రూ.1.10 లక్షల నుండి రూ.1.50 లక్షల వరకు ఉండేలా నివేదికలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు అవతల, అలాగే ముచ్చర్ల సమీపంలో రాబోయే 'భారత్ ఫ్యూచర్ సిటీ' పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం ధరలు గజానికి రూ.25,000 నుండి రూ.60,000 వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా ధరలు పెరగనున్నాయి.
ధరలు పెరగక ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని జనాలు భారీగా తరలివస్తుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. ఇందుకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలోకి వచ్చే పలు సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళలను ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు పొడిగించారు.
ఈ అదనపు సమయం వర్తించే ప్రాంతాల్లో చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీ నగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ ఉన్నాయి.