Telangana Caste Survey Data : తెలంగాణ కుల గణన డేటా విడుదల - టాప్ 20లోని సామాజిక వర్గాలివే

Telangana govt caste survey data : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2024-25 కుల గణన (SEEEPC) వివరాలను వెల్లడించింది. 1.12 కోట్ల కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను వెల్లడిస్తూ ప్లానింగ్ వెబ్‌సైట్‌లో డేటాను అందుబాటులో ఉంచింది.

Published on: Apr 16, 2026 10:38 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన (SEEEPC) - 2024 సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ డేటాను ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది.

తెలంగాణ కుల గణన డేటా విడుదల
తెలంగాణ కుల గణన డేటా విడుదల

దేశవ్యాప్తంగా కుల గణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను వెల్లడించారు. “రాష్ట్ర వ్యాప్తంగా కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను (97.10) శాతం సర్వే నిర్వహించడం జరిగింది మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 జనాభా వివరాలు సేకరించాడు జరిగింది. 97.10 శాతం సర్వే పూర్తి చేశాం. సెల్ఫ్ డిక్లరేషన్ పకడ్బందీగా చేశాం. లక్ష 3 వేల ప్రభుత్వ సిబ్బంది తో పారదర్శకంగా సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా రోల్ మెడల్ తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే నిలిచింది. కేంద్రం మా ప్రభుత్వం చేపట్టిన సర్వే డేటా ను పరిగణనలోకి తీసుకోవాలి” అని ఆయన కోరారు.

సర్వే కోసం ప్రభుత్వం ఒక లక్ష మందికి పైగా ఎన్యుమరేటర్లను, 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకున్న సంగతి తెలిసిందే. 2024 నవంబర్ 6న ప్రారంభమైన మొదటి దశ సర్వే కేవలం 50 రోజుల్లోనే విజయవంతంగా పూర్తయ్యింది.

ఈ సర్వేను కేవలం ఇంటింటికీ తిరిగి సేకరించడమే కాకుండా, ప్రజల సౌకర్యార్థం రెండో దశలో నాలుగు రకాల వినూత్న పద్ధతులను (విండోస్) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయాల్లో నేరుగా నమోదు చేసుకునే వెసులుబాటు కలిపించింది. ప్రత్యేకంగా కేటాయించిన మిస్డ్ కాల్ నంబర్ ద్వారా వివరాల నమోదుతో పాటు ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరించింది. మీ-సేవ కేంద్రాల ద్వారా ఎన్‌రోల్‌మెంట్ చేసుకునే అవకాశం కల్పించింది.

తెలంగాణలోని ప్రతి పౌరుడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, తద్వారా భవిష్యత్తులో మెరుగైన సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఈ డేటా ఒక కీలకంగా ఉపయోగపడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఈ గణాంకాలు దిక్సూచిగా మారతాయని విశ్లేషిస్తున్నారు.

SEEEPC సర్వే -2024 - టాప్ 20లోని సామాజిక వర్గాలు:

1. మాదిగ – 36,57,551 (10.3%)

2. ముదిరాజ్ – 26,39,027 (7.4%)

3. లంబాడీ / బంజారా (Lambadis) – 24,04,056 (6.8%)

4. యాదవ (Yadava/Golla) – 20,18,725 (5.7%)

5. రెడ్డి (Reddy) – 17,10,244 (4.8%)

6. గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)

7. మాల (Mala) – 14,71,514 (4.1%)

8. మున్నూరు కాపు (Munnurukapu) – 13,75,018 (3.9%)

9. పద్మశాలి (Padmasali) – 11,82,252 (3.3%)

10. రజక (Rajaka) – 9,95,972 (2.8%)

11. కురుమ / కురుబ (Kuruba/Kuruma) – 7,95,822 (2.2%)

12. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) – 6,43,571 (1.8%)

13. ముస్లింలు (OC Muslims) – 6,32,782 (1.8%)

14. అగ్నికులక్షత్రియ (Agnikulakshatriya) – 5,27,119 (1.5%)

15. కొమటి / వైశ్య (Komati/Vaishya) – 5,08,813 (1.4%)

16. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) – 4,33,785 (1.2%)

17. కుమ్మర (Kummara) – 4,31,363 (1.2%)

18. కొయ (Koya) – 4,28,142 (1.2%)

19. వడ్రంగి (Vadrangi) – 4,07,927 (1.1%)

20. గోండ్ (Gond) – 3,81,895 (1.1%)

రాష్ట్రంలో బీసీల జనాభా 56.36 శాతంగా ఉండగా,,, ఎస్సీల జనాభా 17.42 శాతంగా ఉంది. ఇక ఎస్టీల జనాభా 10.43 శాతం, ఓబీసీ జనాభా 15.79 శాతంగా ఉండగా… నో క్యాస్ట్ 4 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించిన డేటాలో పేర్కొంది. http://des.telangana.gov.in లో సర్వే వివరాలు అందుబాటులో ఉన్నాయని వివరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More