గ్రేటర్ ‘పోలీస్’ పునర్ వ్యవస్థీకరణ..! కమిషనరేట్లలో కొత్తగా వచ్చిన మార్పులేంటి..? ముఖ్యమైన 10 పాయింట్లు

జీహెచ్ఎంసీని పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజించింది. 

Published on: Dec 31, 2025, 10:39:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న 3 కమిషనర్లేట్లను పునర్ వ్యవస్థీకరించింది. అంతేకాదు… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్యూచర్ సిటీ పేరుతో మరో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేసింది. దీంతో సిటీ కమిషనరేట్ల పరిధిలో పలు మార్పులు వచ్చాయి.

తెలంగాణ పోలీస్ శాఖ
తెలంగాణ పోలీస్ శాఖ

కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ - ముఖ్యమైన విషయాలు

  1. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలోని పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజించింది.
  2. ఇప్పటి వరకు సిటీని కవర్ చేస్తూ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. తాజాగా ప్యూచర్ సిటీ పేరుతో మరో కమిషనరేట్ ఏర్పాటైంది.
  3. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించి నేపథ్యంలో….. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
  4. కొత్త కమిషనరేట్ ఏర్పాటు నేపథ్యంలో కీలక మార్పులు జరిగాయి.రాచకొండ కమిషనరేట్ ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్ గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు వీటిలో కలిపారు.
  5. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే భువనగిరి ఉండేది. కానీ భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్(జిల్లా పోలిసింగ్) గా ఏర్పాటు చేశారు. కొత్తగా జిల్లా ఎస్పీని కూడా నియమించారు.
  6. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి.
  7. నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటాయి.
  8. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరంతో పాటు కొన్ని ప్రాంతాలను కలిపి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు.
  9. ఇప్పటి వరకు రాచకొండ సీపీగా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
  10. అవినాష్ మొహంతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. డా. ఎం. రమేష్ ను బరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించగా… అక్షంష్ యాదవ్ ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా నియమించారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More