మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 84 గెలుచుకుంది. పోటీ చేసిన 2,996 వార్డులలో 1,537 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాలు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ 781 సీట్లతో 25 మునిసిపాలిటీలను గెలుచుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ సంస్థలు, 335 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఒక మునిసిపాలిటీని కైవసం చేసుకుంది.

అలాగే మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుచుకుంది. రెండింటిలో బీజేపీ ఆధిక్యం సాధించింది. కానీ నిజామాబాద్ లో హంగ్ ఏర్పడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్‌ను స్పష్టమైన మెజారిటీతో బీజేపీ చేజిక్కించుకుంది. కొత్తగూడెంలో సీపీఐతో కలిసి కాంగ్రెస్ పీఠం చేజిక్కుంటుంది. ఇక బీఆర్‌ఎస్ ఒక్కటీ దక్కించుకోలేదు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 44 వార్డులను గెలుచుకున్నారు. బీఆర్‌ఎస్ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. పారిశ్రామిక కేంద్రమైన రామగుండంలో కాంగ్రెస్ 38 స్థానాలను గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 13 స్థానాలను గెలుచుకుంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 66 వార్డులలో 30 వార్డులను గెలుచుకుంది బీజేపీ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 28 సీట్లను గెలిచింది. ఇతరుల మద్దతో పీఠం దక్కించుకుంది. తెలంగాణలో పట్టు సాధించడానికి ఎప్పటి నుంచో చూస్తున్న బీజేపీ ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవడంతో మరింత ఆసక్తి పెరిగింది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తమ పార్టీ మెజారిటీ వార్డులను గెలుచుకోవడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్‌పై కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని జోస్యం చెప్పారు.
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నిర్మల్ జిల్లాలోని భైంసా మునిసిపాలిటీని గెలుచుకుంది. 26 వార్డులలో 12 వార్డులను గెలుచుకుంది, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 70 వార్డుల వరకు కైవసం చేసుకుంది. ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలలో ఆ పార్టీ తన ఆధిక్యాన్ని కనబరిచింది.
{{/usCountry}}అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నిర్మల్ జిల్లాలోని భైంసా మునిసిపాలిటీని గెలుచుకుంది. 26 వార్డులలో 12 వార్డులను గెలుచుకుంది, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 70 వార్డుల వరకు కైవసం చేసుకుంది. ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలలో ఆ పార్టీ తన ఆధిక్యాన్ని కనబరిచింది.
{{/usCountry}}ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. బీజేపీ ప్రభావం ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్‌లో గట్టి పోటీని ఇచ్చింది. ఇక నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఆధిపత్యం చెలాయించింది హస్తం పార్టీ. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తితో సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలను నమోదు చేసింది.
బీఆర్ఎస్ సిరిసిల్లలో 27, గుమ్మడిదలలో 15 స్థానాలను గెలుచుకుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొంత స్థానాన్ని దక్కించుకోగలిగింది. అయితే ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన పార్టీ చాలా మునిసిపాలిటీలను కోల్పోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఈ తీర్పు బీఆర్ఎస్ పట్ల ప్రజలకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఫిబ్రవరి 11వ తేదీ నాడు 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 73 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్ మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలకు ఫిబ్రవరి 14 శనివారం నోటిఫికేషన్ జారీ అవుతుంది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లు, కార్పొరేషన్ మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు.