...
...
Next Story

Telangana NEET UG 2026 Merit List : నీట్ యూజీ 2026 తెలంగాణ మెరిట్ జాబితా విడుదల - కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు ఇలా

Telangana NEET-UG 2026 Qualified Candidates : తెలంగాణ నీట్-యుజి 2026 అర్హత సాధించిన అభ్యర్థుల ర్యాంకుల వారీ జాబితాను కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్ విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, కౌన్సెలింగ్ వివరాలను పేర్కొంది.

Published on: Aug 2, 2026, 08:01:38 IST
Advertisement

Telangana NEET-UG 2026 Qualified Candidates : తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) కీలక అప్‌డేట్ అందించింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థుల ర్యాంకుల వారీ వివరాల జాబితాను శనివారం అధికారికంగా విడుదల చేసింది.

తెలంగాణ నీట్-యూజీ 2026 అర్హుల జాబితా విడుదల
తెలంగాణ నీట్-యూజీ 2026 అర్హుల జాబితా విడుదల

డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) నుంచి అందిన సమాచారం ఆధారంగా విశ్వవిద్యాలయం ఈ వివరాలను వెల్లడించింది. వైద్య విద్యలో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ( https://www.knruhs.telangana.gov.in/ ) ద్వారా ఈ జాబితాను పరిశీలించుకోవచ్చు.

కటాఫ్ మార్కులు ఇలా…

2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఖరారు చేసిన అర్హత కటాఫ్ మార్కులు, పెర్సంటైల్ వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది.

  • జనరల్ / ఇడబ్ల్యూఎస్ (UR/EWS ): 50వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 715 నుంచి 213 మార్కులు.
  • ఓబీసీ (OBC) : 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
  • ఎస్సీ (SC) : 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
  • ఎస్టీ (ST): 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
  • జనరల్ / ఇడబ్ల్యూఎస్ డిసేబుల్డ్ (UR/EWS & PWD) : 45వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 194 మార్కులు.
  • ఓబీసీ డిసేబుల్డ్ (OBC & PWD): 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 193 నుండి 177 మార్కులు.
  • ఎస్సీ డిసేబుల్డ్ (SC & PWD): 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 193 నుండి 177 మార్కులు.
  • ఎస్టీ డిసేబుల్డ్ (ST & PWD): 40వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 191 నుండి 177 మార్కులు.

2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేపడుతూ త్వరలోనే వేరొక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కాళోజీ నారాయణరావు విద్యాపీఠం అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన తదుపరి సమాచారం, తాజా వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ ( https://www.knruhs.telangana.gov.in/ ) ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ధృవపత్రాల పరిశీలన అనంతరం అసలైన మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి సంబంధిత పీడీఎఫ్ ఓపెన్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe