...
...
Next Story

TGPSC Exam Hall Ticket : పీసీబీలో 'ఏఈఈ' ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్((AEE)) పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్ష హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Oct 21, 2026, 10:19:41 IST
Advertisement

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న రిక్రూట్‌మెంట్ పరీక్ష హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను పొందవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పరీక్ష ఈనెల 26వ తేదీన జరగనుంది.

డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

  • అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్సి అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ని సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే "Assistant Environmental Engineer Hall Ticket Download" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ టీజీపీఎస్సీ ఐడీ (TGPSC ID), పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • వివరాలు సరిగ్గా ఉంటే మీ హాల్ టికెట్ తెరపై కనిపిస్తుంది.
  • దానిని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసి ఉంచుకోవాలి.

ఏఈఈ హాల్‌టికెట్లు విడుదల
ఏఈఈ హాల్‌టికెట్లు విడుదల

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును (ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైనవి) తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్ష తేదీలు, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రం వివరాలన్నింటినీ అభ్యర్థులు హాల్ టికెట్‌లో స్పష్టంగా తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేశారు.

  • ఉదయం పూట జరిగే పరీక్షకు ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం పూట జరిగే ఆఫ్టర్‌నూన్ (AN) సెషన్ పరీక్షకు మధ్యాహ్నం 2:00 గంటలకే గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాతి సమయాల్లో వచ్చే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించరు.
  • ప్రతి పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు (రెండున్నర గంటలు). పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాల్ వదిలి బయటకు వెళ్లడానికి వీలులేదు.
  • ప్రింట్ తీసిన హాల్‌టికెట్, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
  • పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదైనా ఒక ఒరిజినల్ కార్డును తీసుకెళ్లవచ్చు. ఒరిజినల్ ఐడీ కార్డు మరియు హాల్‌టికెట్ లేని వారిని సెంటర్‌లోకి రానివ్వరు.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లు, పుస్తకాలు లేదా నోట్స్, రికార్డింగ్ సాధనాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks