తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. నవంబర్ 30 వరకు సీఎం రేవంత్ సమీక్షలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCలో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.
వరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతోపాటుగా అంశాల వారిగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒక్కో రోజు ఒక్కో అంశంపై సమీక్ష నిర్వహిస్తుంది ప్రభుత్వం
నవంబర్ 25న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై సమీక్ష ఉంది. నవంబర్ 26 లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు, నవంబర్ 27 మౌలిక వసతులు, అభివృద్ధి (పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, రవాణా, రోడ్లు - భవనాలు, ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, మున్సిపల్ వ్యవహారాలు)పై చర్చిస్తారు.
నవంబర్ 28 విద్య, యువజన సంక్షేమం, (క్రీడలు, నైపుణ్యత, టూరిజం, దేవాదాయ శాఖ), నవంబర్ 29 వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ), నవంబర్ 30 ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం సమీక్ష నిర్వహిస్తారు.
ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష చేస్తారు. ఆయా తేదీల్లో జరిగే సమీక్షలు మంత్రులు హాజరవుతారు. ప్రత్యేకంగా చర్చిస్తారు. కమ్యూనికేషన్, అతిథి సదుపాయాలు మెుదలైన మౌలిక సదుపాయాలపై మాట్లాడుతారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్‌లో అగ్ని-ఇన్నోవేషన్ సెషన్లపై చర్చ ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


