తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరు అయ్యారు. ప్రభుత్వం అనుకున్నట్టుగానే భారీగా పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలు ఈ సమ్మిట్‌లో జరిగాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూలు, పెట్టుబడులు మెుత్తం కలిపి రూ.5.75కి చేరుకున్నాయి. డిసెంబర్ 8వ తేదీన రూ.2,43,000 కోట్లు, డిసెంబర్ 9వ తేదీన రూ.3.32 లక్షల కోట్లు పెట్టుబడులు, ఎంవోయూలు జరిగాయి. మెుత్తం 5 లక్షల కోట్లకుపైగా చేరుకుంది. ఇందులో పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం ఫారెస్ట్‌తోపాటుగా ఇతర రంగాలు కూడా ఉన్నాయి.
ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఎంవోయూలు చేసుకున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మరోవైపు ఫ్యూచర్ సిటీ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు వచ్చిన ప్రముఖులు తెలంగాణ విధానాలను ప్రశంసించారు.
మెుదటి రోజు దేశ, విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి. సుమారు రూ.2.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. పలు కంపెనీలు 35 ఎంవోయూలకు పైగా సంతకాలు చేశాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుడులకు ఒప్పందాలు జరిగాయి. డిసెంబర్ 9వ తేదీన రూ.3.32 లక్షల కోట్లపైనే పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ప్రకృతి, అభివృద్ధి కలిసి నడిచే బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలలో తెలంగాణను అగ్రగామిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ నది కేవలం నీటి వనరు మాత్రమే కాదు, అది హైదరాబాద్ జీవనాడి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
'రీజనల్ రింగ్ రోడ్డుతో కలిసిన రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ భవిష్యత్తు రవాణాకు వెన్నెముకగా మారుతుంది. వృద్ధిని విస్తరించడానికి, గ్రామీణ, పెరి-అర్బన్ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి రూపొందించిన బహుళ నమూనా వ్యవస్థ. రోడ్డు మార్గం వెంట రైలును ప్లాన్ చేస్తున్నారు.' అని సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ అన్నారు.
{{/usCountry}}'రీజనల్ రింగ్ రోడ్డుతో కలిసిన రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ భవిష్యత్తు రవాణాకు వెన్నెముకగా మారుతుంది. వృద్ధిని విస్తరించడానికి, గ్రామీణ, పెరి-అర్బన్ ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి రూపొందించిన బహుళ నమూనా వ్యవస్థ. రోడ్డు మార్గం వెంట రైలును ప్లాన్ చేస్తున్నారు.' అని సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ అన్నారు.
{{/usCountry}}