తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 4 వేలకుపైగా ప్రముఖలను ఆహ్వానిస్తోంది. వివిద రంగాలకు చెందిన ప్రముఖలనే కాకుండా దేశ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందజేస్తోంది. ఈ సదస్సును అత్యంత విజయవంతం చేయాలని చూస్తోంది.

ఈ సదస్సు నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు పేర్కొంటోంది.
రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్లడానికి ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. బిజినెస్, స్పోర్ట్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, టూరిజం... ఇలా అన్ని రంగాల్లో ప్రగతికి అవసరమైన అన్ని అంశాలు పాలసీలో ఉంటాయి.
ఉచితంగా బస్సులు…
ఓవైపు భారీగా ఏర్పాటు చేస్తుడంగా… తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మిట్ కు సామాన్య ప్రజలు కూడా హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. అంతేకాదు హైదరాబాద్ సిటీ నుంచి ఉచితంగా బస్సులను కూడా నడపనుంది.
సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్ పల్లి, చార్మినార్, ఎల్పీ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఫ్యూచర్ సిటీకి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. నిర్దేశించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.
{{/usCountry}}సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్ పల్లి, చార్మినార్, ఎల్పీ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఫ్యూచర్ సిటీకి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. నిర్దేశించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.
{{/usCountry}}