...
...
Next Story

TG TET Results 2026 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - జూలై ఆఖరి వారంలో ఫలితాలు..!

Telangana TET Results 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్ సెషన్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. జూలై 28 నుంచి 31వ తేదీల మధ్య ఫలితాలు వెల్లడికానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Jul 12, 2026, 05:12:50 IST
Advertisement

Telangana TET Results 2026 : తెలంగాణ టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీలు విడుదల కాగా… అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలోనే ఈ ఫలితాలను ప్రకటించనున్నారు.

తెలంగాణ టెట్ ఫలితాలు -2026
తెలంగాణ టెట్ ఫలితాలు -2026

విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఈ ఫలితాలను జూలై 28 నుంచి 31వ తేదీల మధ్య అధికారికంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దిశగా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. మరోవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రాథమిక కీని పరిశీలించుకున్న అభ్యర్థుల నుంచి విద్యాశాఖ జూలై 2వ తేదీ వరకు అభ్యంతరాలను కూడా స్వీకరించింది. సేకరించిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తుది కీతో పాటు అభ్యర్థుల మార్కుల వివరాలను, అర్హత సాధించిన వారి జాబితాను బోర్డు ప్రకటించనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ స్కోర్ అత్యంత కీలకం. జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) పద్ధతిలో పేపర్-1, పేపర్-2 పరీక్షలను విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

టీజీ టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా మార్కులను చూసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారిక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది.

  1. మొదటగా అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in ను ఓపెన్ చేయాలి.
  2. హోంపేజీలో కనిపించే 'TG TET June 2026 Results' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో అభ్యర్థి తన హాల్ టికెట్ నంబర్ (లేదా అప్లికేషన్ నంబర్), పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే స్క్రీన్‌పై టెట్ స్కోర్‌కార్డ్ ప్రత్యక్షమవుతుంది.
  5. భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవడం మంచిది.

ఇక టెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి కనీస మార్కులను సాధించాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • జనరల్ కేటగిరీ (OC) : కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అంటే 150 మార్కులకు గానూ 90 మార్కులు రావలసి ఉంటుంది.
  • వెనుకబడిన తరగతులు (BC) : కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అంటే 75 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు (SC/ST/PwD): కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అంటే 150 మార్కులకు గానూ 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
  • టెట్‌లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks