SIR Claims Objections : ‘సర్’ లిస్టులో మీ పేరు లేదా...? వెంటనే ఇలా చేయండి, ఏ ఫారమ్ దేనికంటే..?
SIR Claims Objections : తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR-2026)లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 16 వరకు ఫామ్‌లు సమర్పించి సవరణలు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.
SIR Claims Objections : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియ కొనసాగుతోంది.క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 16, 2026 వరకు ఓటర్లు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 10, 2026 వరకు నిర్వహించిన ఎన్యుమరేషన్ సమయంలో నిర్దేశిత ఫారమ్‌లను సమర్పించలేకపోయిన ఓటర్లకు ఇది మరో అవకాశం. అలాంటి అభ్యర్థులు ఇప్పుడు నిర్ణీత డిక్లరేషన్‌తో పాటు ఫారమ్-6 ద్వారా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో సవరణలు చేయడం, తప్పుగా నమోదైన పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
ఏ ఫారమ్ దేనికి…?
ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ వివిధ అవసరాల కోసం ప్రత్యేక ఫారమ్‌లను అందుబాటులో ఉంచింది.
- ఫారమ్ 6 (Form 6) : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి.
- ఫారమ్ 6A : విదేశీ భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి.
- ఫారమ్ 7 : ఓటర్ల జాబితాలోని పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా పేరును తొలగించాలని కోరడానికి.
- ఫారమ్ 8 : నియోజకవర్గం లోపల లేదా బయటకు చిరునామా మార్పు, వ్యక్తిగత వివరాల సవరణ, ఎలాంటి మార్పులు లేని ఐడీ కార్డు (EPIC) రీప్లేస్‌మెంట్, దివ్యాంగుల (PwD) ఓటరుగా నమోదు కోసం ఈ ఫారమ్ వాడాలి.
అందిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పకడ్బందీగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం భారీ యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (EROs), 892 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROs) ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- ఆఫ్‌లైన్ ద్వారా : దరఖాస్తు ఫారమ్‌లను నేరుగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO)కు అందజేయవచ్చు.
- ఆన్‌లైన్ ద్వారా : ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫారమ్‌లు 9, 10, 11, 11A, 11Bలలో దాఖలైన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పూర్తి జాబితాను తెలంగాణ సీఈవో (CEO Telangana) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పౌరులు ఈ జాబితాను పరిశీలించి… ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఈఆర్‌ఓకు నివేదించవచ్చు. అంతేకాకుండా, పారదర్శకత కోసం ప్రతీ వారం ఈ జాబితాలను రాజకీయ పార్టీలకు కూడా ఈఆర్‌ఓలు అందజేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

