...
...
Next Story

తెలంగాణలో మగాళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్న ఆడవాళ్లు.. భవిష్యత్తులోనూ అంతే!

తెలంగాణలో ఆడవాళ్ల కంటే పురుషులు తక్కువ కాలం జీవిస్తున్నారు. ఆహారశైలి, అలవాట్లు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణంగా ఉన్నాయి.

Published on: Dec 14, 2025, 22:07:45 IST
Advertisement

నేడు తెలంగాణలో జన్మించిన బిడ్డ మునుపటి తరం కంటే చాలా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. 2036 నాటికి తెలంగాణలో పురుషుడి సగటు ఆయుర్దాయం 71.40 సంవత్సరాలు ఉంటుందని అంచనా. అయితే మహిళలు 75.60 సంవత్సరాల సగటు ఆయుర్దాయంతో మరింత మెరుగ్గా ఉంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ జనాభా కమిషన్ 'జనాభా అంచనా నివేదిక 2011-2036'లో నమోదు చేసినన ఆయుర్దాయం పెరుగుదల గురించి ఆసక్తిక విషయాలు వెల్లడయ్యాయి. ఆడవారి కంటే మగవాళ్లు తక్కువగా జీవిస్తున్నారు.

తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం 2011-2015 కాలంలో సుమారు 67.10 సంవత్సరాలు ఉండగా, 2031-2035 నాటికి 71.40 సంవత్సరాలకు పెరుగుతుందని అంచనా. అదే కాలంలో స్త్రీల ఆయుర్దాయం దాదాపు 71.10 సంవత్సరాల నుండి 75.60 సంవత్సరాలకు పెరగడంతో వారు మరింత మెరుగ్గా బతుకుతారని భావిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా మగాళ్ల కంటే మహిళలే ఎక్కువగా జీవిస్తున్నారు. భవిష్యత్తులు కూడా ఇది ఇలాగే కొనసాగనుంది.

శిశు మరణాల రేటు తగ్గుదలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు(TFR) కూడా గణనీయంగా తగ్గుతోంది. 2013-2035 మధ్య తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.5కి తగ్గుతుంది. పుట్టే పిల్లల సంఖ్య తగ్గడం, ఎక్కువ కాలం జీవించే వ్యక్తులతో జనాభాలో అధిక వయస్సు వర్గాలవారు ఉంటారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణతో సహా భారత రాష్ట్రాల జనాభా పరిస్థితి మారుతోందని, ప్రజలు ఎక్కువ కాలం జీవించడమే కాకుండా జనాభాలో వృద్ధాప్యం కూడా పెరుగుతోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య విధాన నిపుణులు ఈ నివేదికలోని అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు.

జనాభా వృద్ధి రేటు చుసుకుంటే (2011-2015లో 7.1 శాతం), (2016-20లో 5.4), (2021-25లో 3.5), (2026-30లో 1.7), (2031-35లో 0.3)గా ఉంది.

శిశు మరణాల రేటు (2011-2015లో 39 శాతం), (2016-20లో 35), (2021-25లో 32), (2026-30లో 29), (2031-35లో 27 శాతం) ఉంది. మొత్తం సంతానోత్పత్తి రేటు తగ్గింది.

(2011-2015లో 1.68 శాతం), (2016-20లో 1.61), (2021-25లో 1.54), (2026-30లో 1.51), (2031-35లో 1.50)గా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks