TS DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన విద్యార్థులు.. జూలై 20, 2026 నుండి జూలై 26, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :
- నూతన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ (రూ. 400/- ఫీజుతో) : జూలై 20, 2026 నుండి జూలై 26, 2026 వరకు.
- వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 20, 2026 నుంచి జూలై 27, 2026 వరకు అవకాశం ఉంటుంది.
- ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ (PH/CAP/NCC/Sports/Extra-Curricular): జూలై 27, 2026 న యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో జరుగుతుంది.
- ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు : జూలై 30, 2026.
- ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు.
- కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల సమర్పణ : ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ , ఇతర ధృవీకరణ పత్రాలను జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 లోపు సంబంధిత కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
- రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. కాబట్టి ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్లలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన విద్యార్థులు తమ పాత ఐడీ , పిన్ ద్వారా నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
గత విడతలలో సీటు వచ్చి… నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కళాశాలకు మారాలనుకుంటే ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు సీటు పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని అధికారులు సూచించారు.