తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET (గతంలో TS EAMCET) ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులలో మొదలైన అతిపెద్ద టెన్షన్ 'నాకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏ బ్రాంచ్ దొరుకుతుంది?' అని విద్యార్థులు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తారు.

వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి తప్పులు చేయకుండా, మీ ర్యాంకుకు బెస్ట్ కాలేజీని ఎంచుకోవడానికి గత ఏడాది (2025) నాటి Last Rank Statements (ఆఖరి ర్యాంకుల వివరాలు) అద్భుతంగా యూజ్ అవుతాయి. ఫేజ్-1, ఫేజ్-2, ఫైనల్ ఫేజ్ కటాఫ్ ర్యాంకులను విశ్లేషించడం ద్వారా 2026లో మీకు రాబోయే సీటును ఎలా అంచనా వేయాలో ఇక్కడ చూద్దాం.
మూడు దశలు
కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది. ప్రతి దశకు సంబంధించిన లాస్ట్ ర్యాంక్ ట్రెండ్స్ మారుతుంటాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభంలో టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ సైన్స్ (CSE), ఐటీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులు తక్కువ ర్యాంకుల్లోనే ముగిసిపోతాయి. దీని ద్వారా టాప్-10 కాలేజీల పోటీని అంచనా వేయవచ్చు.
సెకండ్ ఫేజ్ మొదటి విడతలో సీట్లు వదులుకున్న వారు జేఈఈ (JEE Main/Advanced) వైపు వెళ్లిన వారి వల్ల చాలా సీట్లు ఖాళీ అవుతాయి. ఫేజ్-1 లో సీటు రాని వారికి, లేదా బెటర్ కాలేజ్ కోరుకునే వారికి సెకండ్ ఫేజ్ కటాఫ్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుంది. చాలా వరకు ఒక క్లారిటీ వస్తుంది.
ఫైనల్ ఫేజ్ ఇది అత్యంత కీలకం. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ఏ కాలేజీలో, ఏ కేటగిరీ (OC, BC, SC, ST, EWS) కింద ఏ ర్యాంకు వరకు సీటు కేటాయించారో ఇందులో స్పష్టంగా తెలుస్తుంది.
2026 సీట్ల అంచనా కోసం ఏం చేయాలి?
{{/usCountry}}ఫైనల్ ఫేజ్ ఇది అత్యంత కీలకం. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ఏ కాలేజీలో, ఏ కేటగిరీ (OC, BC, SC, ST, EWS) కింద ఏ ర్యాంకు వరకు సీటు కేటాయించారో ఇందులో స్పష్టంగా తెలుస్తుంది.
2026 సీట్ల అంచనా కోసం ఏం చేయాలి?
{{/usCountry}}అధికారిక వెబ్‌సైట్ నుండి డేటా తీసుకోవాలి. TG EAPCET అధికారిక పోర్టల్ నుండి 2025 ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఫేజ్ 'Last Rank Statements' పీడీఎఫ్ (PDF) లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ స్టేట్‌మెంట్లలో బాయ్స్, రీజియన్, రిజర్వేషన్ కేటగిరీల వారీగా విడివిడిగా ర్యాంకులు ఉంటాయి. మీ కేటగిరీకి సరిపోయే ఆఖరి ర్యాంకును మాత్రమే గమనించండి.
గత ఏడాది కటాఫ్ ర్యాంకులకు, ఈ ఏడాది కటాఫ్ ర్యాంకులకు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు గత ఏడాది ఫైనల్ ఫేజ్‌లో ఒక కాలేజీలో సీఎస్ఈ సీటు 5,000 ర్యాంకుకు క్లోజ్ అయితే.. ఈ ఏడాది మీ ర్యాంకు 4,500 నుండి 5,500 లోపు ఉంటే అక్కడ సీటు వచ్చే అవకాశం ఉందని అర్థం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కటాఫ్‍లో మార్పులు రావొచ్చు. ఈ అంచనా ప్రకారం కచ్చితంగా సీటు వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించకూడదు. జస్ట్ కిందటి ఏడాదితో పోల్చుకుంటే విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది.
TGEAPCET 2025 Last Rank Statement First Phase
TGEAPCET 2025 Last Rank Statement Second Phase
TGEAPCET 2025 Last Rank Statement Final Phase