TG EAPCET 2026 Final Phase Allotment : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రవేశాల కమిటీ మంగళవారం చివరి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. ఈ విడతలో కొత్తగా 3,281 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద (ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి) మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉంచారు. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 75 వేలకుపైగా సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 19 వేలకుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తంగా 80 శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి.
విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపే కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ 19 బ్రాంచీల్లో మొత్తం 66,390 సీట్లు ఉండగా, 54,730 సీట్లు నిండాయి. డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ కోర్సుల్లో కూడా 11,660 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. గతంలో పోలిస్తే….. ఈసారి సీఎస్ఈ, ఐటీ విభాగాల్లో 82 శాతం సీట్లు మాత్రమే నిండాయి.
రిపోర్ట్ తేదీలివే…
టీజీ ఈఏపీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆగస్టు 7వ తేదీలోగా అలాట్‌మెంట్ లెటర్‌లో సూచించిన ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, సంబంధిత కళాశాలలో స్వయంగా హాజరై రిపోర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
TG EAPCET ఫైనల్ ఫేజ్ అలాట్ మెంట్ - ఎలా చెక్ చేసుకోవాలి?
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'Candidates Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు ఆ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని… ప్రింట్ అవుట్ కాపీని భద్రపరుచుకోవాలి.
- అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ అర్డక్ కాపీ చాలా కీలకం.
ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్ అవకాశం
కళాశాలల్లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచీలను మార్చుకోవాలనుకుంటే ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని ప్రవేశాల కమిటీ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్లైడింగ్ ద్వారా బ్రాంచి మారినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
{{/usCountry}}కళాశాలల్లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచీలను మార్చుకోవాలనుకుంటే ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని ప్రవేశాల కమిటీ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్లైడింగ్ ద్వారా బ్రాంచి మారినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
{{/usCountry}}