తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGEAPCET ద్వారా ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం బీ.ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సులలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే సర్టిఫికేట్లు ధృవీకరించుకున్న అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 3, 4 తేదీలలో తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీన తమ ఆప్షన్లను తప్పనిసరిగా ఫ్రీజ్ చేయాలి.
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
{{^htLoading}} {{/htLoading}}
సీట్ల తాత్కాలిక కేటాయింపు సెప్టెంబర్ 6వ తేదీన లేదా అంతకంటే ముందుగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్-రిపోర్టింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సెప్టెంబర్ 8వ తేదీలోగా కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
TGEAPCET-2026 ప్రవేశాల ద్వారా ఇప్పటికే ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చేరిన అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవడానికి అర్హులు కారు. కౌన్సెలింగ్ ఒకే దశలో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ ఆప్షన్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5 వరకు జరిగింది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగస్ట్ 2న ముగిసింది. టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం… తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 5 నాటికి పూర్తి చేసి, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేశారు.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు కోరారు. కచ్చితంగా చేరడానికి ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}
{{#usCountry}}
విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు కోరారు. కచ్చితంగా చేరడానికి ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.