రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈనెల 19 నుంచి అప్లికేషన్లు…

ఫిబ్రవరి 19 నుంచి టీజీ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే… మే 2 వరకు ఛాన్స్ ఉంటుంది.
టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది.
టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ 2026 - ముఖ్యమైన తేదీలు:
- ఎంట్రెన్స్ పరీక్ష - టీజీ ఈఏపీసెట్ - 2026
- దరఖాస్త విధానం - ఆన్ లైన్
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 19 ఫిబ్రవరి 2026
- ఫైన్ లేకుండా చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026)
- ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
- టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
- టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/
టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ సీట్ల మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఈసారి కూడా జేఎన్టీయూనే టీజీ ఈఏపీసెట్ ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది. ఇంటర్, జేఈఈ పరీక్షల దృష్ట్యా…ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ కోసం ముందుగానే కసరత్తు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలనే షెడ్యూల్ ఖరారు కాగా… ఇవాళ నోటిఫికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.