రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే… మే 2 వరకు అవకాశం కల్పించారు.

టీజీ ఈఏపీసెట్ - 2026కి సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. తాజాగా మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులతో పాటు ఫార్మసీ - అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం వేర్వురుగా వీటిని వెబ్ సైట్ లో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఉచితంగా రాసుకోవచ్చు.
TG EAPCET 2026 మాక్ టెస్టులు - ఇలా రాయండి
- అభ్యర్థులు ముందుగా https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ ( Mock Test) లింక్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఇంజినీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ ఆప్షన్ కనిపిస్తాయి.
- మీరు ఏ పరీక్షకు అర్హులవుతారో ఆ స్ట్రీమ్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సైన్ ఇన్ కావాలి.
- ఇక్కడ ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. 160 ప్రశ్నలుంటాయి.
- 160 ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి 180 నిమిషాల సమయం ఇస్తారు.
- ప్రశ్న పత్రంలో కేవలం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.
- ఈ పరీక్షలను ఉచితంగా ఎన్ని సార్లు అయినా రాసుకునే వీలుంటుంది.
టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది.
{{/usCountry}}టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది.
{{/usCountry}}టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ 2026 - ముఖ్య తేదీలు
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ - టీజీ ఈఏపీసెట్ 2026
- దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026)
- టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
- టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/