నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణ ఆర్టీసీలో 198 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన వివరాలు
తెలంగాణ ఆర్టీసీ మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు TSLPRB ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా… తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆర్టీసీలో ఖాళీగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 198 ఖాళీలున్నాయి.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB (తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవాలి. ఈ గడువు జనవరి 20, 2026వ తేదీతో పూర్తవుతుంది. ఆయా అభ్యర్థులు http://tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- నోటిఫికేషన్ ప్రకటన - తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బో
- ఖాళీలు - తెలంగాణ ఆర్టీసీ
- ఉద్యోగ ఖాళీల వివరాలు -ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114
- డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెడికల్ పరీక్షలుంటాయి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - డిసెంబర్ 30, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 20, జనవరి 2026
- దరఖాస్తు ఫీజు -ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి.
- మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకునే ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి.
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://www.tgprb.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ PDF చూడొచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

