తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మెుత్తం 19 రోజులపాటు వీటిని అందించనున్నారు. ఇందుకోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు అయ్యాయి.

పదో తరగతి విద్యార్థులకు సాయంత్రంపూట స్నాక్స్ అందించాలని నిర్ణయిస్తూ.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోన విద్యార్థులకు వీటిని అందిస్తారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను వెంటనే.. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని చెప్పారు. అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూళ్లలో ఉండే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదని ఈ నిధులు కేటాయించినట్టుగా తెలిపారు.
పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే కేవలం 19 రోజులే స్నాక్స్ అందించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతేడాది 39 రోజులు అందించారని, ఈ ఏడాది కేవలం 19 రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ పేర్కొంది.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు పూర్తి కాగా అధికారులు మరో అవకాశం కల్పించారు. తత్కాల్ పథకం కింద రూ.1000 ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ గడువు జనవరి 27వ తేదీతో ముగియనుంది. ఇక జనవరి 29వ తేదీలోపు విద్యార్థుల సమాచారాన్ని ఆయా హెడ్ మాస్టర్లు.. డీఈవోలకు సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
{{/usCountry}}ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
{{/usCountry}}కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ విడుదలైంది. 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.