...
...
Next Story

TG LRS : తెలంగాణలో ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఇదే

తెలంగాణలో అనుమతిలేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఛార్జీల్లో 25 శాతం రాయితీ గడువును పొడిగించింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published on: Jul 31, 2026, 19:48:07 IST
Advertisement

తెలంగాణలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS - Layout Regularization Scheme) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుపై 25 శాతం రాయితీ పొందే అవకాశాన్ని 2026 నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో జారీ చేశారు.

ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు

దీనిద్వారా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ రుసుమును నిర్ణీత గడువులోగా చెల్లించే ప్లాట్ల యజమానులకు 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ సదుపాయం 2026 ఆగస్టు 1వ తేదీ నుండి 2026 నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. రుసుముపై 25 శాతం ముందస్తు రాయితీని పునరుద్ధరించడం వల్ల ప్లాట్ల యజమానులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. లేఅవుట్లు క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ప్లాట్లకు చట్టబద్ధత లభించి, రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వ జీవో ప్రకారం సంబంధిత HMDA, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు దీనికి అనుగుణంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతేడాదిలో 31 మార్చి 2026 వరకు 25 శాతం రాయితీ కల్పిస్తూ.. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనితో రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మూడుసార్లు గడువు పొడిగించినా.. రూ.2 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఎస్ఐఆర్ కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నార. దీంతో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe