హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలుకుతూ.. ప్రయాణ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు దిగిన వెంటనే ప్రయాణికులు కిందకు రాకుండానే నేరుగా స్టేషన్ నుంచే డ్రైవర్ లేని పాడ్ టాక్సీ(Pod Taxi) ఎక్కి తమ ఆఫీసులకు చేరుకునేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ప్రాజెక్టును ప్రతిపాదించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను వివరించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(PPP) పద్ధతిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సుమారు మూడు నెలల పాటు లోతైన అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ సంస్థ కీలక సిఫార్సులు చేసింది. ప్రాథమికంగా 44.62 కి.మీ, 56.98 కి.మీ మార్గాలను పరిశీలించిన అనంతరం, రెండింటినీ మిళితం చేస్తూ 40.82 కిలోమీటర్ల హైబ్రిడ్ నెట్‌వర్క్ నిర్మించడం అత్యంత ప్రయోజనకరమని తేల్చింది.
నాలుగు ప్రధాన కారిడార్లు
కూకట్‌పల్లి - రాయదుర్గం జోన్: 7.62 కిలోమీటర్లు
రాయదుర్గం - నాలెడ్జ్ సిటీ జోన్: 12.83 కిలోమీటర్లు
రాయదుర్గం/హైటెక్ సిటీ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోన్: 14.01 కిలోమీటర్లు
సచివాలయం - ఎన్టీఆర్ మార్గ్ కారిడార్: 6.36 కిలోమీటర్లు
హైదరాబాద్ ప్రాజెక్టును మూడు ప్రధాన దశల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. 2030 నాటికి 34.66 కి.మీ నెట్‌వర్క్ పూర్తి (రోజువారీ ప్రయాణికులు: 5.42 లక్షలు). 2040 నాటికి 39.36 కి.మీ విస్తరణ (రోజువారీ ప్రయాణికులు: 15.47 లక్షలు). 2050 నాటికి: 40.82 కి.మీ పూర్తి స్థాయి నెట్‌వర్క్ (రోజువారీ ప్రయాణికులు 20.31 లక్షలు) అని ప్రాజెక్ట్ అంచనా.
ప్రస్తుతం నగరంలోని 69 కిలోమీటర్ల మెట్రో లైన్లలో రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, భవిష్యత్తులో పాడ్ టాక్సీ వ్యవస్థ నగర రవాణాలో కీలక పాత్ర పోషించనుంది. 2050 నాటికి ఒక్క సచివాలయం కారిడార్లోనే రోజుకు 43,300 మంది ప్రయాణిస్తారని నివేదిక అంచనా వేసింది.
{{/usCountry}}ప్రస్తుతం నగరంలోని 69 కిలోమీటర్ల మెట్రో లైన్లలో రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, భవిష్యత్తులో పాడ్ టాక్సీ వ్యవస్థ నగర రవాణాలో కీలక పాత్ర పోషించనుంది. 2050 నాటికి ఒక్క సచివాలయం కారిడార్లోనే రోజుకు 43,300 మంది ప్రయాణిస్తారని నివేదిక అంచనా వేసింది.
{{/usCountry}}మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ కంపెనీలు, వాణిజ్య సముదాయాలకు నేరుగా చేరుకోవడానికి ఇది అద్భుతమైన పరిష్కారం. ఈ చిన్న ప్యాసింజర్ పాడ్‌లు పూర్తి ఆటోమేటెడ్‌గా పనిచేస్తాయి. నిర్ణీత ట్రాక్‌లపై ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాయి. విద్యుత్ శక్తితో నడిచే ఈ వాహనాలు శబ్దం, వాయు కాలుష్యాన్ని పూర్తిగా నివారిస్తాయి.
దేశంలోనే మొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్‌ను ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో పీపీపీ పద్ధతిలో రూ.1,016 కోట్ల వ్యయంతో 8.85 కి.మీ మేర నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫిల్మ్ సిటీ ప్రాంతంలోనూ పాడ్ టాక్సీ ప్రణాళికలు సాగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చితే.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా గ్లోబల్ నగరాల సరసన హైదరాబాద్ రవాణా వ్యవస్థ నిలుస్తుంది.