...
...
Next Story

TG SET Notification 2026 : త్వరలోనే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ - కొత్త అప్డేట్ ఇదే

TG SET Notification 2026 :టీజీ సెట్ పై మరో అప్డేట్ వచ్చేసింది. మే నెలలో కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.

Published on: Mar 24, 2026 09:14 AM IST
Advertisement

రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే మే నెలలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ సెట్ 2026
తెలంగాణ సెట్ 2026

మే నెలలో సెట్ నోటిఫికేషన్ ఇవ్వగా… ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

  • అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
  • టీజీ సెట్ -2026ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు.
  • కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష ఉంటుంది.
  • ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌ 2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
  • టీఎస్ సెట్ నోటిఫికేష‌న్‌, సిలబస్ తో పాటు పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

మరోవైపు గతేడాదిలో నిర్వహించిన తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి.. ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.

టీజీ సెట్ రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోండి

  1. టీజీ సెట్ - 2025 అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా స్కోర్ కార్డు కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe